Currency
Indian Currency Notes: ఇండియన్ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫోటో మాత్రమే దశాబ్దాలుగా ముద్రిస్తున్నారు. తాజాగా మహాత్మాగాంధీతోపాటు ఎంపిక చేసిన నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్ తోపాటు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోలు కూడా ముద్రించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి సంబంధించిన డిజైన్ వర్క్ అంతా పూర్తయిందని..ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకోవటమే ఆలస్యమంటూ మీడియాలో వస్తున్న కథనాలపై క్లారిటీ వచ్చేసింది.
అటువంటి ప్రతిపాదనే తమ వద్దకు రాలేదని చెప్తూ.. ఇవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో ఎలాంటి మార్పులు చేయటంలేదని స్పష్టం చేసింది.
Read Also: భారత్‌లో మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ ఇండెక్స్ లాంచ్
ఈ వ్యాఖ్యలపై స్పందించిన RBI చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ దయాల్ మాట్లాడుతూ, “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ స్థానంలో ఇతరుల బొమ్మను ఉంచడం ద్వారా ప్రస్తుత కరెన్సీ, బ్యాంకు నోట్లలో మార్పులు చేస్తారని మీడియాలో ప్రచారం అవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్‌కు అటువంటి ప్రతిపాదన ఏదీ రాలేదని గమనించాలి” అని వ్యాఖ్యానించారు.