India First Cryptocurrency Index : భారత్‌లో మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ ఇండెక్స్ లాంఛ్..దీని పేరేంటో తెలుసా?..
భారత్ లో కూడా క్రిప్టోకరెన్సీ ఇండెక్స్ లాంఛ్ అయ్యింది. భారత్ మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ సూచీ అధికారికంగా లాంఛ్ అయ్యింది.

India First Cryptocurrency Index
India First Cryptocurrency Index IC15: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డబ్బుల రూపం కూడా మారిపోతోంది. కంటికి కనిపించని కరెన్సీ జీవితాలనే మార్చేస్తోంది. అటువంటిదే క్రిప్టోకరెన్సీ. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే మాట. క్రిప్టోకరెన్సీ. ఇప్పుడు భారత్ లో కూడా క్రిప్టోకరెన్సీ ఇండెక్స్ లాంఛ్ అయ్యింది. భారత్ మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ సూచీ (ఇండెక్స్) అధికారికంగా లాంఛ్ అయ్యింది. క్రిప్టో మార్కెట్ గురించి దాని తీరుతెన్నుల గురించి ఈ సూచీ ఎప్పుటికప్పుడు చాలా వివరిస్తుంది ఈ సూచీ.
ఇదికూడా చదవండి : Read more : El Salvador Cryptocurrency : చిన్నదేశం..గొప్ప ఆలోచన..అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్ తయారీ ఘనత
ప్రపంచంలో క్రిప్టోకరెన్సీ సూపర్ యాప్‌గా గుర్తింపు పొందుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో క్రిప్టోవైర్ ఈ కరెన్సీ సూచీని తీసుకొచ్చింది. దీని పేరు ‘ఐసీ15 (IC15)’. క్రిప్టోమార్కెట్ గురించి..దాని తీరుతెన్నులను ఎప్పటికప్పుడు వివరించడమే ఈ సూచీ నిరంతర పని.
ఇదికూడా చదవండి : Crypto currency Sharia : క్రిప్టో కరెన్సీ షరియాకి విరుద్ధం అన్న ముస్లిం మత పెద్దలు..కరెన్సీపై నిషేధం విధించిన దేశం
అదేమంటే..బాగా ట్రేడింగ్‌లో, లీడింగ్ ఎక్స్ఛేంజ్‌లో ఉన్న క్రిప్టోకరెన్సీల పనితీరును పర్యవేక్షించడం, ఆ వివరాల్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చేయటం, ట్రిక్కర్‌ప్లాంట్ లిమిటెడ్‌లో స్పెషల్ బిజినెస్ యూనిట్‌గా ఉన్న క్రిప్టోవైర్.. క్రిప్టో లెక్కలు వంటి అన్ని వివరాల్ని పక్కాగా తెలియజేస్తుంటుందీ ఇండెక్స్. ఇది క్రిప్టో ఇన్వెస్టర్లకు మాత్రమే కాదు..దీనిపై ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్లకు కూడా క్రిప్టో మార్కెట్ గురించి అన్ని వివరాలను ఎప్పటికప్పుడు అర్థమయ్యేలా తెలియజేస్తుంది.
అంతేకాదు..ఈ Index(సూచీ).. క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ ఇకోస్టిస్టమ్ మీద అవగాహన కల్పించేలా కూడా పనిచేస్తుంది. డొమైన్ ఎక్స్‌పర్ట్స్, విద్యావేత్తలు, మేధావులతో కూడిన గవర్నెన్స్ కమిటీ(IGC) ఐసీ15లో ఉంటుంది. ఏదైనా ఒక క్రిప్టోకరెన్సీకి ఇండెక్స్‌లో చోటు దక్కాలంటే.. రివ్యూ ప్రకారం ట్రేడింగ్ రోజుల్లో కనీసం 90 శాతం అయినా ట్రేడ్ అయ్యి తీరాలి. గత నెలలో మార్కెట్ క్యాపిటలైజేషన్ సర్క్యులేటింగ్ పరంగా టాప్ 50లో ఉండాలి. IC15 ఇండెక్స్‌లో లిస్టింగ్‌కు అర్హత పొందేందుకు మాత్రం.. ట్రేడింగ్ విలువ పరంగా అది టాప్ 100 అత్యంత లిక్విడ్ క్రిప్టోకరెన్సీలలో ఒకటిగా ఉండాలి.ఇలా పలు రకాలుగా ఈ సూచి పనిచేస్తుందన్నమాట..
Bitcoins : 7500 బిట్ కాయిన్లను చెత్తబుట్టలో పడేసిన భార్య..నాసా శాస్త్రవేత్తలతో వెతికిస్తున్న భర్త..