×
Ad

గెలిస్తేనే మాస్క్ తీస్తా అని మంగమ్మ శపథం చేసిన ఓ పార్టీ అధ్యక్షురాలు.. ఇప్పుడు ఘోర ఓటమి.. ఇప్పుడేం చేస్తావ్?

ఎల్లప్పుడూ నల్ల దుస్తుల్లో, మాస్క్‌తోనే కనిపించే ఆమె.. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే మాస్క్ తీస్తానని ప్రతిజ్ఞ చేశారు.

Pushpam Priya Choudhary: బిహార్ ఎన్నికల వేళ ప్లూరల్స్ పార్టీ అధ్యక్షురాలు పుష్పం ప్రియా చౌదరి ఓ శపథం చేశారు. ఈ ఎన్నికల్లో తాను దర్బహంగా నుంచి పోటీ చేస్తున్నానని, గెలిస్తేనే మాస్క్ తీస్తానని బల్లగుద్ది చెప్పారు.

ఇప్పుడు ఆమె ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. బిహార్‌లో గెలిచే వరకు మాస్క్ తీయనని ప్రతిజ్ఞ చేసిన పుష్పం ప్రియా తన మాటను నిలబెట్టుకుంటారా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. (Pushpam Priya Choudhary)

పుష్పం ప్రియా చౌదరి ఈ ఎన్నికల్లో వెనకబడిన తీరు చూస్తే అసలు ఆమె ఆ ప్రతిజ్ఞ ఏ నమ్మకంతో చేసిందన్న అనుమానం రాక తప్పదు. ఆమె టాప్‌-5లో కూడా లేరు. ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు.

ఈ స్థానంలో 2020లో బీజేపీ అభ్యర్థి సంజయ్ సరావ్గీ గెలిచారు. ఇప్పుడూ ఆయనే ముందంజలో ఉన్నారు. ఆయనకంటే వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ అభ్యర్థి ఉమేశ్ సహాని 4,800 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. సంజయ్ కంటే పుష్పం ప్రియా 26,000 ఓట్లకుపైగా వెనుకబడి ఉన్నారు.

బిహార్‌లో మత, కులరహిత రాజకీయాలు చేయాలన్న లక్ష్యంతో పుష్పం ప్రియా 2020లో ప్లూరల్స్ పార్టీ స్థాపించారు. రాష్ట్రంలో 243 స్థానాలన్నింటిలో ఆమె పార్టీ ‘విజిల్’ గుర్తుతో పోటీ చేసింది. ఎల్లప్పుడూ నల్ల దుస్తుల్లో, మాస్క్‌తోనే కనిపించే ఆమె.. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే మాస్క్ తీస్తానని ప్రతిజ్ఞ చేశారు.

ఆమె తండ్రి, జేడీయూ మాజీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ చౌదరి. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి నితీశ్‌ కుమార్‌కు సన్నిహితుడు, సమతా పార్టీ స్థాపకుల్లో ఒకరు. ఆమె మామ వినయ్‌కుమార్‌ చౌదరి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బెనిపూర్ స్థానంలో జేడీయూ అభ్యర్థిగా గెలిచారు. పుష్పం ప్రియా పార్టీ 2020లో 148 స్థానాల్లోనూ పోటీ చేసినప్పటికీ ఒక్కటి సీటూ గెలవలేదు.