మహారాష్ట్రలో ఒక్కరోజే 30వేలు దాటిన కరోనా కేసులు..ముంబైలో రికార్డుస్థాయిలో 5,185 కేసులు

మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం(మార్చి-24,2021 రాష్ట్రవ్యాప్తంగా 31,855 కొత్త కరోనా కేసులు,95మరణాలు నమోదయ్యాయి.

New Covid Cases మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం(మార్చి-24,2021 రాష్ట్రవ్యాప్తంగా 31,855 కొత్త కరోనా కేసులు,95మరణాలు నమోదయ్యాయి. అయితే, ఒక్క ముంబై నగరంలోనే ఇవాళ రికార్డు స్థాయిలో 5,185కరోనా కేసులు,ఆరు మరణాలు నమోదయ్యాయి. ముంబైలో 5వేలకు పైగా కరోనా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన వారం రోజులుగా ముంబైలో 3వేలకు పైగా నమోదవుతున్న కరోనా కేసులు ఇవాళ ఒక్కసారిగా 5వేలు దాటడం ఆందోళనకర విషయం.

కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి-28,29న ముంబైలో హోలీ సంబరాలపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఎపిడమిక్ డిసీజ్ యార్ట్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద కేసులు నమోదుచేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇక,మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 25,64,881కు చేరింది. మరణాల సంఖ్య 53,684కి చేరింది. ఇక,కోలుకున్నవారి సంఖ్య 22,62,593కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,47,299యాక్టివ్ కేసులున్నాయి.

ట్రెండింగ్ వార్తలు