Super El Nino: ఎర్రబారిన ఖగోళం.. వేడెక్కుతున్న భూమి.. 150 ఏళ్ల తర్వాత ఉగ్రరూపంలో ఎల్నినో.. వాతావరణ శాఖ భయంకర హెచ్చరిక!

భారీ ఉష్ణోగ్రతల విడుదల కారణంగా ఈ ఏడాది ఎల్నినో(Super El Nino) తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోందని అంతర్జాతీయ వాతావరణ నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

WMO warns Super El Nino record-breaking global temperatures and extreme weather conditions 2027.

Super El Nino: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. మానవ కార్యకలాపాలు, పసిఫిక్ మహాసముద్రంలో నిల్వ ఉన్న భారీ ఉష్ణోగ్రతల విడుదల కారణంగా ఈ ఏడాది ఎల్నినో(Super El Nino) తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోందని అంతర్జాతీయ వాతావరణ నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్నినోల్లో ఇది ఒకటిగా నిలవడమే కాకుండా, రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా సాధారణం కంటే అనేక రెట్లు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ పేర్కొంది.

CM Revanth Reddy: మోదీ గద్దె దిగు.. లేదా ప్రజలే దింపుతారు.. ఈసీని అడ్డుపెట్టుకుని దొడ్డిదారి పాలనా? రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మ్యాప్‌లో ఎర్రబడిన భూమి.. రికార్డు స్థాయికి సముద్ర ఉష్ణోగ్రతలు:

ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు విడుదల చేసిన గ్లోబల్ టెంపరేచర్ మ్యాప్‌లలో దాదాపు భూమి మొత్తం ఎరుపు రంగులోకి మారి భయపెట్టే రీతిలో కనిపిస్తోంది. ఎల్నినోకు కేంద్ర బిందువైన పసిఫిక్ సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 3.4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి ఏకంగా 3.7 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశముండటంతో, నిపుణులు దీనిని ‘సూపర్-డూపర్ ఎల్నినో’గా అభివర్ణిస్తున్నారు.

శీతాకాలంలోనూ వేడి గాలులు.. 2027 వరకు కొనసాగే ఛాన్స్:

సాధారణంగా శీతాకాలంలో చల్లదనంతో ఉపశమనం లభించాల్సి ఉండగా, ఈ సారి ఎల్నినో గరిష్ఠ తీవ్రత కారణంగా వేడి వాతావరణమే కొనసాగనుంది. అమెరికా మినహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విపరీతమైన వేడి తరంగాలు మరియు వాతావరణ మార్పుల ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు సుదీర్ఘంగా కొనసాగే అవకాశముందని స్పష్టం చేశారు.

APSRTC Special Buses: దసరాకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. పండగకు 5,261 ప్రత్యేక బస్సులు.. ప్రయాణికులకు బిగ్ రిలీఫ్!

ఎక్కడో కరువు.. మరెక్కడో భయపెట్టే భారీ వర్షాలు:

ఈ ఎల్నినో ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వర్షపాత నమూనాలు పూర్తిగా తల్లకిందులు కానున్నాయి. ఒకవైపు కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వర్షాభావం, కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే, మరోవైపు కొన్ని దేశాల్లో ఊహించని రీతిలో ముంచెత్తే భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదముంది. ఈ తీవ్ర ప్రతికూల పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం, ప్రాణాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.