Shivanand Baba : కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 125ఏళ్ల బాబా

ప్రపంచంలోనే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి గుర్తింపు పొందిన వారణాశికి చెందిన శివానంద బాబా(125)బుధవారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

Shivanand Baba ప్రపంచంలోనే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి గుర్తింపు పొందిన వారణాశికి చెందిన శివానంద బాబా(125)బుధవారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వారణాశిలోని దుర్గకుండ్ లోని వ్యాక్సినేషన్ లో సెంటర్ లో.. శివానంద బాబాకి కోవిషీల్డ్ మొదటి డోస్ ఇచ్చారు. 125 ఏళ్ల వయస్సులోనూ బాబా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.

వాక్సిన్​ కేంద్రానికి ఆయన నడుస్తూ వెళ్తుంటే అక్కడున్నవారంతా ఆయన కాళ్లపై పడి నమస్కరించారు. ఆధార్ కార్డు ప్రకారం శివానంద బాబా వయస్సు 125 ఏళ్లు కాగా,వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ సమయంలో ఆయన 121గా రిజిస్ట్రర్ చేయబడింది.

1896 ఆగస్టు 8న ప్రస్తుత బంగ్లాదేశ్ లోని శ్రిహాత్ జిల్లాలో ఓ నిరుపేద కుటుంబంలో 1896 ఆగస్టు 8న శివానంద బాబా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆకలితో మరణించారు.
1977లో ఉత్తరప్రదేశ్ లోని బృందావన్​లోని ఆశ్రమంలో ఆయన దీక్ష చేపట్టారు. అక్కడ 2 సంవత్సరాలు నివసించిన తరువాత, 1979లో కాశీ(వారణాశి)కి వచ్చారు. అప్పటి నుంచి కాశీలోనే నివసిస్తున్నారు. స్థోమత లేక పేద ప్రజలు పండ్లు, పాలు తీసుకోవడం లేదని బాబా కూడా వాటిని మానేశారు. రొట్టేలు, కూరగాయలు, ఉడక బెట్టిన ఆహారాన్ని మాత్రమే తింటారు. ఇప్పటికీ రోజూ యోగా చేస్తూ ఉంటారు.

ట్రెండింగ్ వార్తలు