woman kill (2)
Woman Beaten To Death : బీహార్ లోని ఖగారియా జిల్లాలో దారుణం జరిగింది. పొలంలో పని చేస్తున్న ఓ మహిళను కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. ఆపై ఆమె కనుగుడ్లు పెకిలించారు. అంతటితో ఆగకుండా ఆమె నాలుక కోశారు. ఆమె ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పస్రాహ గ్రామానికి చెందిన సులేఖా దేవి(45) తన పొలంలో పని చేస్తున్నారు.
భూ వివాదం విషయంలో కొందరు పురుషులు ఆమెపై దాడి చేశారు. అనంతరం కత్తితో ఆమె కనుగుడ్లు పెకిలించారు. అంతటితో ఆగకుండా నాలుక కోశారు. ఆమె ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
Darsi Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. శుభకార్యానికి వెళ్తుండగా ఘటన
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పొరుగున ఉండే ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిని అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరోవైపు సులేఖా దేవి దారుణ హత్యను ఖండిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. అయితే 2014 ఏప్రిల్ 25న సులేఖా దేవి భర్త బబ్లూ సింగ్, ఆమె మరిదిని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. కాగా, ఈ హత్య కేసు నిందితులు గతేడాది బెయిల్ పై విడుదల కావడం గమనార్హం.