West Bengal
West Bengal : టిక్కెట్టు కొనగలిగే స్థోమత ఉండి కూడా కొందరు రైళ్లలో టిక్కెట్టు కొనకుండా తప్పించుకుంటారు. కొన్ని సందర్భాల్లో దొరికిపోయి టీసీకి ఫైన్లు కడుతుంటారు. ఓ మహిళను చూసి అలాంటి వారికి కనువిప్పు కావాలి. తను తనతోపాటు ట్రైన్‌లో తీసుకెళ్తున్న తన మేకకి కూడా టిక్కెట్ కొన్న ఆ మహిళ నిజాయితీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Chhattisgarh : తనను బలి ఇచ్చిన వ్యక్తి ప్రాణం తీసిన అదే మేక కన్ను..!
అవనీష్ శరణ్ (@AwanishSharan) అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో అందరిని ఆకర్షించింది. ‘ఆమె తన మేకకు కూడా రైలు టిక్కెట్టు కొని ఈ విషయాన్ని టిటిఈకి గర్వంగా చెబుతోంది. ఆమె చిరునవ్వులు చూడండి. అద్భుతం’ అంటూ అవనీష్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మహిళను టీటీఈ (TTE) టిక్కెట్ గురించి అడుగుతున్నప్పుడు వీడియో మొదలౌతుంది. వారి సంభాషణ బెంగాలీలో సాగింది. మహిళ ముఖంపై నవ్వు.. ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ‘మీకు మేకకు టిక్కెట్ ఉందా?’ అని టీటీఈ చమత్కారంగా అడిగినపుడు ‘అవును’ అంటూ ఆమె చెప్పిన సమాధానంతో నవ్వులు పంచుకున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Kota Goat : ఈ మేక బరువు 176 కిలోలు .. ధర అక్షరాలా రూ.12 లక్షలు!
‘ఆమె ఎంత నిజాయితీపరురాలు..నిజానికి మన దేశానికి ఇలాంటి వ్యక్తులు కావాలి’ .. ‘ఆమె చిరునవ్వు గొప్పగా మాట్లాడుతుంది’ అంటూ నెటిజన్లు ఆ మహిళపై ప్రశంసలు కురిపించారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్‌లో జరిగింది.
She bought train ticket for her goat as well and proudly tells this to the TTE.
Look at her smile. Awesome.❤️ pic.twitter.com/gqFqOAdheq
— Awanish Sharan ?? (@AwanishSharan) September 6, 2023