డేట్ యాప్‌లో మరో అమ్మాయిని చూస్తూ.. గర్ల్ ఫ్రెండ్‌కు ఎలా దొరికిపోయాడో చూడండి..

Woman catches date checking out other women online : రెస్టారెంటులో గర్ల్ ఫ్రెండ్ ఎదురుగానే ఉంది.. డోంట్ కేర్ అనుకున్నాడు.. ఫోన్‌లో ఆన్‌లైన్ డేటింగ్‌ యాప్‌లో మరో అమ్మాయి కోసం తెగ వెతికేస్తున్నాడు. ఆమె చూడలేదులే అనుకున్నాడు.. కానీ, అడ్డంగా దొరికియాడు.. అతడి కళ్లజోడులో ఫోన్ డిస్‌ప్లే చూసి గర్ల్ ఫ్రెండ్ పసిగట్టేసింది.. నన్ను ఎదురుగా ఉంచుకుని మరో అమ్మాయితో డేటింగ్ కావాలా అంటూ కడిగిపారేసింది.. అతడి కళ్ల జోడులో కనిపించే ఫోన్ స్ర్కీన్ జూమ్ చేసి మరి చూసింది.

అతడు బంబుల్ డేటింగ్ యాప్ స్ర్కోలింగ్ చేస్తున్నట్టు గుర్తించింది. డేటింగ్ యాప్ లో అమ్మాయిల ఫొటోలను స్ర్కోలింగ్ చేయడం చూసి షాక్ అయింది. ఫోన్ లాగేసుకుని ఏం చూస్తున్నావంటూ నిలదీసింది.. అదేం లేదు.. సరదాగా అలా చేశానంటూ అతడు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.. కానీ, ఆమె వినలేదు.. చివరికి ఎలాగో అలా ఆమెను కన్విన్స్ చేశాడు..

ఇదంతా ఆమెను ఉడికించడం కోసం అలా చేశానంటూ చెప్పి ఏదోలా ఆమెను కూల్ చేశాడు. ఇదంతా అక్కడి మరో స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోకు 4.5 లక్షల వ్యూస్ వచ్చాయి. 1,600 కామెంట్లు వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు వారిద్దరిని సరదా కామెంట్లతో ఏకిపారేశారు..