divorce papers పై సంతకం పెట్టాలని భార్యను నిర్భందించిన భర్త

  • Publish Date - September 20, 2020 / 02:02 PM IST

విడాకుల పత్రంపై సంతకం పెట్టేదాక పుట్టింటికి పంపించేది లేదని ఓ వివాహితను గదిలో నిర్భందం చేశాడో భర్త. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…నాగ్ పూర్ కు చెందిన Sonia Dutta మహిళ Bengaluru లో pharmacologist గా పని చేస్తుండేది.



అదే నగరంలో పని చేస్తున్న వినాయక్ సింగ్ (33) పరిచయం ఏర్పడింది. ఇతను IIT graduate, online investment లో ఉద్యోగి పనిచేస్తుంటాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో గత ఏడాది ఆగస్టులో వివాహం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 20వ తేదీన పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది.

కానీ వీరి జీవితం కొంతకాలం సాఫీగానే సాగినా..విబేధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వార్త ఛానెళ్లను చూడడం వినాయక్ కు నచ్చలేదు. లాక్ డౌన్ విధించడానికి ముందు…అతని తల్లి దగ్గరకు పంపించాడని, కానీ..తాను పుట్టింటికి వెళ్లాలని అనుకున్నానని తెలిపింది.



భిన్నమైన రాజకీయాలు ఉన్నందున విడాకులు ఇస్తానని గతంలో వినాయక్ సింగ్ వెల్లడించాడని సోనియా వెల్లడించింది. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి పుట్టింటిక వెళ్లాలని కోరుకుంది. కానీ..విడాకుల పత్రంపై సంతకం పెట్టే వరకు పంపించేది లేదని, భర్త ఓ గదిలో నిర్భందించారు.

గురువారం తీసుకెళ్లడానికి సోదరి, ఆమె భర్త ఇంటికి వచ్చారు. కానీ…ఓ గదిలో నిర్భందంగా ఉండడం చూసి వారు నిర్ఘాంతపోయారు. విడాకుల పత్రంపై సంతకం పెట్టిన తర్వాత..శుక్రవారం ఆమెను బయటకు వదిలారు. దీనిపై వినాయక్ సింగ్ స్పందించారు. ఏదో ఊహించుకుంటూ..తనను పట్టించుకోదన్నారు.



తన పిల్లాడి గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపాడు. తనను, తన భర్తను కొన్ని గంటల పాటు నిర్భందించారని దత్తా సోదరి వెల్లడించింది. దత్తా నుంచి ఫిర్యాదు వచ్చిందని Patna SSP Upendra Kumar వెల్లడించారు. వీరి మధ్య నెలకొన్న విబేధాలు పరిష్కరించుకొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ట్రెండింగ్ వార్తలు