Bar Dancer Perform at BDO's Farewell Party
Bar Dancer Perform at BDO’s Farewell Party : సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్లు జరుగుతుంటాయి. పాత కొలిగ్స్ ను విడిచి వెళ్లే సమయంలో పార్టీలు సాధారణమే. అలాగే బీహార్ లో ఓ ప్రభుత్వ అధికారి ట్రాన్స్ ఫర్ అయ్యారు. అది విషయమూ కాదు విశేషమూ కాదు. కానీ సదరు ప్రభుత్వ అధికారి ట్రాన్స్ ఫర్ అయిన సందర్బంగా ఫేర్ వెల్ పార్టీ ఇచ్చారు. ఇది కూడా విశేషం కాదు. కానీ ఆ పార్టీలో ఓ బార్ డాన్సర్ తో డ్యాన్సులు వేయించారు. బార్ డ్యాన్సర్లు అంటే వారి డ్యాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
అలా సదరు ప్రభుత్వ అధికారి ఫేర్ వెల్ పార్టీలో ఎరేంజ్ చేసుకున్న పార్టీలో బార్ డ్యాన్సర్ అసభ్యకర ఫోజులిస్తజ డ్యాన్స్ చేసింది. దానికి అక్కడున్నవారంతా రెచ్చిపోయారు. ఆమెపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. ఇది కాస్తాఅక్కడే ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. అది మేజిస్ట్రేట్ దృష్టికి రావటంతో ఆయన రంగంలోకి దిగారు. దర్యాప్తుకు ఆదేశించారు.
Maggi Noodles : ఎయిర్‌పోర్టులో మ్యాగీ ధర రూ. 193..! విమాన ఇంధనంతో తయారు చేశారా ఏంటీ..?
ఖగారియా (Khagaria)జిల్లాలోని బ్లాక్ డెవలప్ మెంటల్ అధికారి (BDO సునీల్ కుమార్ (Sunil Kumar)కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. దీంతో ఆయన ఫేర్ వెట్ పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీలో బార్ డ్యాన్సర్ తో డ్యాన్సులు వేయించారు. ఆమె తీవ్ర అసభ్యంగా ఫోజులిస్తూ డ్యాన్సులే వేసింది. ఆ పోజులకు పిచ్చెక్కిపోయారు అక్కడున్నవారంతా. ఆపార్టీకి హాజరైనవారంతా ప్రభుత్వ అధికారులే ఎక్కువమంది ఉన్నారు. వారంతా రెచ్చిపోయి ఈలలు వేస్తు పిచ్చిపిచ్చి స్టెప్పులు వేస్తు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. వీడియోలో ఫోటోలతో నానా రచ్చా చేశారు. ఈ పార్టీలో జరిగిన బాగోతాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టటంతో అది వైరల్ గా మారి మేజిస్ట్రేట్ దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వ రంగానికి తలవంపులు తెచ్చారంటూ ఫేర్‌వేల్ పార్టీ ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరెవరు పాల్నొన్నారనే విషయాలను వెలికితీసేందుకు దర్యాప్తునకు ఆదేశించారు.