Maggi Noodles : ఎయిర్‌పోర్టులో మ్యాగీ ధర రూ. 193..! విమాన ఇంధనంతో తయారు చేశారా ఏంటీ..?

ఐదు రూపాయల మ్యాగీ ధర వింటే షాక్ అవ్వాల్సిందే. ఎయిర్ పోర్టులో మరీ ఇంత ధరా...? అదేమన్నా విమానం ఇందనంతో తయారు చేశారా ఏంటీ..?

Maggi Noodles : ఎయిర్‌పోర్టులో మ్యాగీ ధర రూ. 193..! విమాన ఇంధనంతో తయారు చేశారా ఏంటీ..?

Maggi Noodles For Rs 193 In Airport

Updated On : July 17, 2023 / 10:38 AM IST

‘టూ మినిట్స్’ మ్యాగీ ఎంత ఫేమస్సో తెలిసిందే. ఆకేస్తోందా..? టూ మినిట్స్ లో మ్యాగీ చేసుకుని లొట్టలేసుకుంటు తినేస్తాం. అలాగే చిన్నపిల్లలకు మ్యాగీ అంటూ ఇక చెప్పనే అక్కర్లేదు. అటువంటి మ్యాగీ ప్యాకెట్ రూ.5లు పెడితే వస్తుంది. అటువంటి రూ.5ల మ్యాగీ బయట కొంటే మహా అయితే ఓ రూ.15లు ఉంటుందేమో..కానీ ఓ ఎయిర్ పోర్టులో రూ.5ల మ్యాగీని ఏకంగా రూ.193లు బిల్లు వేయటంతో కష్టమర్ షాక్ తో వామ్మో ఎంత ఎయిర్ పోర్ట్ అయితే మాత్రం మరీ ఇంత రేటా..? అని నోరెళ్లబెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్ సేజల్ సూద్ ట్విట్టర్‌లో షేర్ చేసిన నూడుల్స్ బిల్ వైరల్ అవుతోంది.

మ్యాగీ మసాలా నూడుల్స్ ధర రూ. 184గా చూపించి దానికి జీఎస్టీ రూ. 9.20 జోడించడంతో రూ. 193.20 బిల్లు అయింది. 20 పైసలు తీసేసి రౌండ్ ఫిగర్‌గా 193 బిల్లు వేశారు. దీంతో ఆ బిల్లు చూసిన సేజల్ షాక్ అయ్యింది. కానీ బిల్లు చెల్లించటం తప్పదు కదా..తిన్నదానికి కట్టిన బిల్లుకు ఏమాత్రం పొంతలేకపోవటంతో ఏమీ చేయలేక సోషల్ మీడియా వేదికగా వాపోయింది. బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఆ బిల్లు చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక అయోమయంలో పడిపోయానని వాపోయింది.

సాధారణంగా బయట కంటే ఎయిర్ పోర్టులో ధరలు ఎక్కువగానే ఉంటాయి కానీ ‘మరీ ఇంతా? ఈ మ్యాగీని విమాన ఇంధనంతో చేశారో ఏమో మరి!’ అంటూ పేర్కొన్నారు సేజల్. రెండు గంటలుగా ఆకలిమీద ఉన్నా.. ఏదోకటి తినాలంటనిపించింది. దీంతో వేరే దారి లేక తినాల్సి వచ్చింది. బిల్లు చూసిన షాక్ లో ఏం చేయాలో కూడా అర్థం కాలేదంటూ వాపోయారు.