Woman Files Rape Complaint Against Chirag Paswans Cousin And Rebel Ljp Mp Prince Raj In Delhi
LJP MP Prince Raj లోక్ జనశక్తి పార్టీ(LJP) నేత చిరాగ్ పాశ్వాన్ సోదరుడు, LJP రెబల్ ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ పై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఢిల్లీలోని కన్నోట్ ప్లేస్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ప్రిన్స్ రాజ్ ఓ మహిళా కార్యకర్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించిన కొన్ని గంటలకే మహిళ ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం.
తనకు మత్తుమందు ఇచ్చి ప్రిన్స్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ తన మూడు పేజీల ఫిర్యాదులో ఆరోపించింది. అయితే ఎంపీ స్థాయి వ్యక్తిపై ఆరోపణలు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మహిళ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై త్వరలో ప్రిన్స్ రాజ్‌ను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.