గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్..బాధితురాలికే ఫైన్

  • Publish Date - August 26, 2020 / 12:25 PM IST

గిరిజన మహిళపై సామూహికంగా అత్యాచారం జరిపారు. కానీ న్యాయం చేయాల్సిన వారే బాధితురాలికే పైన్ వేసిన ఘటన హల్ చల్ చేస్తోంది. సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన వెస్ట్ బెంగాల్ జిల్లాలోని బీర్బూమ్ జిల్లాలో చోటు చేసుకుంది.



మహ్మద్ ‌‌‌‌‌‌‌‌బజార్ ‌‌‌‌‌‌‌‌ఏరియాలో ఓ మహిళ నివాసం ఉంటోంది. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఆగస్టు 18వ తేదీన తన ప్రియుడితో కలిసి ఇంటికి వెళుతోంది. మార్గమధ్యంలో కొంతమంది వారిని ఆపి వేశారని పోలీసులు తెలిపారు.



https://10tv.in/there-is-a-small-but-real-chance-an-asteroid-will-hit-earth-the-day-before-the-us-election/
అనంతరం ఆ రోజు రాత్రి వారిని ఓ గదిలో నిర్భంధించి..మరుసటి రోజు అటవీ ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి ఐదుగురు అత్యాచారం జరిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరిటెండెంట్ సుబిమల్ పాల్ వెల్లడించారు.



కానీ kangaroo court (అనధికార కోర్టు)లో బాధిత మహిళకు, ఆమె ప్రియుడికి రూ. 60 వేలు ఫైన్ విధించారని అక్కడి స్థానిక మీడియా వెల్లడించిందని కానీ అధికారికంగా ధృవీకరించబడలేదన్నారు. ఈ విషయంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతోందన్నారు.