రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఓ ఆసుపత్రిలో ఒక మహిళ ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు మగ శిశువులు. ఇద్దరు ఆడ బిడ్డలు. వీరిలో ఒక శిశువు చనిపోగా.. మరొకరు వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆసుపత్రి వైద్యులు ఈ శిశువులను ప్రత్యేకంగా సంరక్షణలో పెట్టారు. ఒక శిశువు వెంటిలేటర్‌పై ఉంది.
వివరాల్లోకి వెళితే సంగానెరా గ్రామానికి చెందిన రుక్సానా(25) అనే మహిళ జనతా ఆసుపత్రిలో నెలలు నిండకముందే ఐదుగురు శిశువులకు జన్మను ఇచ్చింది. వారిలో ఒక శిశువు జన్మిస్తూనే చనిపోగా పుట్టినప్పుడు ఈ శిశువుల బరువు చాలా తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
ఇదే విషయమై ఆసుపత్రి డాక్టర్ లతా రాజోరియా మాట్లాడుతూ రుక్సానా అనే గర్భిణి ఐదుగురు శిశువుకు జన్మనిచ్చిందని, వీరంతా తక్కువ బరువుతో పుట్టారని, శిశువులలో ఒకరు చనిపోగా.. మరొక శిశువు వెంటిలేటర్‌లో ఉన్నట్లు చెప్పారు.
మిగిలిన ముగ్గురు నవజాత శిశువులను జాగ్రత్తగా చూస్తున్నట్లు చెప్పారు. ఇంతకుముందు ఇటువంటి అరుదైన ఆపరేషన్లు జరిగినప్పటికీ తమ హాస్పిటల్‌లో మాత్రం ఇదే తొలిసారి అని డాక్టర్ చెప్పారు.