Meerut Viral Video : కారులో భర్తతో ప్రియురాలు.. బానెట్‌పై వేలాడుతూ భార్య.. కొద్దిదూరం ఈడ్చుకెళ్లాడు..! వీడియో వైరల్.. చివరికి బిగ్ షాక్..

Meerut Viral Video : ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Meerut woman

Meerut Viral Video : ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్త మరో మహిళతో కారులో ఉండటాన్ని చూసిన భార్య అతడి కారును అడ్డుకొని నిలదీసేందుకు ప్రయత్నించింది. అయితే, భర్త కారును ఆపకుండా పోనివ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆమె కారు బానెట్‌పై వేలాడుతుండగా.. కారును పోనిచ్చిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.

Also Read : AP Weather : ఏపీకి కూల్ న్యూస్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షాలే.. ఉరుములు, మెరుపులతో భారీ అలర్ట్!

పూర్తి వివరాల్లోకి వెళితే.. సునీత, మయాంక్ భార్యాభర్తలు. వీరికి 2012లో వివాహం జరిగింది. వివాహం తర్వాత ఇద్దరి మధ్య వివాదాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సునీత తన పిల్లలతో కలిసి మేరఠ్‌లోని కాజీపుర్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. మయాక్ తన ప్రియురాలు మహీ వర్మతో ఉన్నాడని తెలుసుకున్న సునీత.. వారిద్దరిని రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకొనేందుకు వెళ్లింది. నగరంలో ఓచోట మోమో తింటుండగా వారిని పట్టుకొని నిలదీసింది. దీంతో భార్యాభర్త మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ తరువాత మయాంక్ తన ప్రియురాలితో కలిసి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. భార్య కారును అడ్డగించింది.. భర్త కారును ఆపకుండా పోనివ్వడంతో ఆమె కారు బానెట్ ను పట్టుకుంది.

బానెట్ పట్టుకుని దాదాపు 100 మీటర్లు ముదుకు వెళ్లిన సునీత ‘ భయ్య బచావో’ అంటూ ఆ దారిని వెళ్లేవారిని వేడుకోవడం వీడియోలో రికార్డయింది. స్థానికులు గుమ్మికూడటంతో మయాంక్ కారును ఆపాడు. ఈ ఘటనపై సునీత లోహియా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనను కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడని, రెండుసార్లు డివైడర్‌ను ఢీకొట్టేలా కారు నడిపాడని ఆమె ఆరోపించింది. దీనికితోడు వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సునీత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మయాంక్‌తో పాటు మాహి వర్మను అరెస్ట్ చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.