Karnataka Cm
Woman Kisses CM Basavaraj Bommai : కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై చేయిపై ఓ మహిళ ముద్దుల వర్షం కురిపించింది. మహిళ ముద్దులు పెడుతుండడంతో అక్కడున్న నేతలు అవాక్కయ్యారు. ఆమె చేసిన ప్రవర్తనకు సీఎం కొంత ఇబ్బందికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బెంగళూరులోని గుట్టహళ్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. జనసేవక కార్యక్రమాలు నిర్వహిస్తోంది అక్కడి ప్రభుత్వం.
Read More : Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌లో ఐపీఎల్ లైవ్!!
అందులో భాగంగా..2021, నవంబర్ 01వ తేదీ సోమవారం బెంగళూరులోని గుట్టహళ్లి ప్రాంతంలో సీఎం బొమ్మై పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటి ముందు ఆగారు. స్వయంగా ముఖ్యమంత్రి తనింటికి రావడంతో ఆమె సంతోషంలో మునిగిపోయింది. సీఎంను చూసిన సంతోషంలో షేక్ హ్యాండ్ ఇచ్చారు. సీఎం బొమ్మై కూడా చేయి ఇవ్వడంతో గట్టిగా ఊపింది. అమాంతం చేయిపై ముద్దుల వర్షం కురిపించింది.
Read More : Badvel Election : సీఎం జగన్ మెజార్టీని క్రాస్ చేసిన డా.సుధ
అదే పనిగా ముద్దులు పెడుతుండడంతో సీఎం బొమ్మై కాస్త ఇబ్బందికి గురయ్యారు. ఆయన చెయ్యిని చెంపకు హద్దుకుంది. పక్కనే ఉన్న మంత్రి అశ్వథ్ నారాయణ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరైంది కాదంటూ..సూచించారు. ప్రస్తుతం ఆమె ముద్దులు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.