ట్రాఫిక్ పోలీసులు రూ. 500 ఫైన్, మంగళసూత్రం ఇచ్చిన మహిళ..ఎందుకు ?

mangalsutra : వివాహ తంతులో మాంగల్య ధారణే అతి ప్రధానమైనది. మాంగల్యం అంటే మంగళసూత్రం. గళసూత్రమే మంగళసూత్రమవుతుంది. మంగళ సూత్రం… పరమ పవిత్రం అని అందరూ నమ్ముతారు. వరుడికి వధువుకు అనుసంధానమైనది మంగళసూత్రం. ఎంతో పవిత్రంగా భావించే..ఈ మంగళసూత్రాన్ని ట్రాఫిక్ పోలీసుల చేతుల్లో పెట్టిందో ఆ యువతి. అసలు అలా ఎందుకు చేసింది ? ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే..చదవండి…

కర్నాటకలోని బెలగావిలో భారతి విభూతి అనే 30 ఏళ్ల మహిళ..భర్త హుక్కేరిలోని హుల్లొలిహట్టి గ్రామంలో హోటల్ వ్యాపారం నడుపుతున్నారు. వీరిద్దరూ బైక్ పై వస్తువులు కొనేందుకు రూ. 1800 డబ్బును తీసుకుని సిటీకి వచ్చారు. బెలగావిలో ఉన్న ఓ షాపింగ్ మాల్ లో రూ. 1700 వస్తువులు కొనుగోలు చేశారు. అనంతరం వారివద్ద 100 రూపాయాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆ డబ్బుతో టిఫిన్ తిని ఇంటికి బయలుదేరారు. బస్టాండు ప్రాంతంలో వచ్చే సరికి ట్రాఫిక్ పోలీసులు వారి వాహనాన్ని ఆపారు.

హెల్మెట్ లేకుండా..బండి నడుపుతున్నావంటూ..రూ. 500 ఫైన్ కట్టాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. తమ వద్దనున్న డబ్బులు అన్నీ అయిపోయాయని..విభూతి చెప్పింది. జరిమాన కట్టి తీరాల్సిందేనంటూ..పోలీసులు పట్టుబట్టారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు విభూతి..తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి ట్రాఫిక్ పోలీసుల చేతిలో పెట్టింది. దీనిని అమ్ముకుని జరిమాన తీసుకోవాల్సిందిగా చెప్పేసింది. దాదాపు రెండు గంటలుగా కొనసాగడంతో రద్దీ నెలకొంది. ఆ సమయంలో అటువైపు నుంచి వెళుతున్న సీనియర్ పోలీసుల అధికారుల దృష్టికి వచ్చింది. అనంతరం వారు జోక్యం చేసుకుని విభూతిని..ఆమె భర్తను అక్కడి నుంచి పంపించారు.