Delhi : తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో చెల్లెలిపై కాల్పులు జరిపిన మహిళ

తన భర్తతో చెల్లెలికి వివాహేతర సంబంధం ఉందని ఆమె అక్క అనుమానపడింది. అంతే ఆమెను మట్టుబెట్టడానికి ప్రయత్నించింది. కంట్రీ మేడ్ పిస్టల్‌తో ఆమెపై కాల్పులు జరిపింది.

Delhi

Delhi :  తోడబుట్టిన చెల్లిపై అక్క దారుణానికి ఒడి గట్టింది. తన భర్తతో చెల్లెలికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో పిస్టల్‌తో కాల్పులు జరిపింది. తీవ్రగాయాల పాలైన చెల్లెలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది.

Delhi : డ్యూటీలో ఉన్న పోలీసు ఆఫీసర్‌ను చెంప‌ దెబ్బ కొట్టిన మహిళ.. ఆమె విపరీత ప్రవర్తనకు షాకైన నెటిజన్లు

ఢిల్లీ శాస్త్రి పార్క్ బులంద్ మసీదు సమీపంలో నివాసం ఉంటున్న సుమైలపై ఆమె అక్క సోను కంట్రీ మేడ్ పిస్టల్‌తో కాల్పులు జరిపింది. తన భర్తతో సుమైల వివాహేతర బంధం కొనసాగిస్తోందనే అనుమానంతో ఆమెపై దాడి చేసింది. పిస్టల్ బేస్‌తో సోను ఆమె తలపై బాదడంతో సుమైల ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సుమైల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Delhi Man Quits Job : ఆఫీస్ దూరమైందని మొదటిరోజే జాబ్‌కు రిజైన్.. సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందనతో కంగుతిన్న యువకుడు..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యాయత్నం మరియు ఆయుధాల చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సోనును అరెస్టు చేసారు.