×
Ad

Video: ‘భారత్‌లో బాగా డబ్బున్న భర్త కోసం ఇందులో షాపింగ్ చేయొచ్చు’ అంటూ అమ్మాయి పోస్ట్‌.. కెవ్వుకేకలాంటి ఐడియా..

మహిళలను గోల్డ్ డిగ్గర్లు (ధనదాహం ఉన్నవారు) అని వెటకారం చేసే పురుషులే ఈ యాప్‌ను రూపొందించారని ఆమె సెటైర్లు వేసింది.

Video: బాగా డబ్బున్న భర్త కోసం ఓ యాప్‌లో షాపింగ్ చేయొచ్చు అంటూ మహిళా హక్కుల కార్యకర్త, న్యాయవాది తన్యా ఆపాచు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఏఐ (కృత్రిమ మేధ) ఆధారంగా నడిచే వివాహ యాప్ ‘నాట్ డేటింగ్’పై వ్యంగ్యంగా స్పందిస్తూ ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసింది.

తన్యా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలు ‘షాదీ డాట్ కామ్’, ‘టిండర్’ వంటి వివాహ యాప్‌ల వంటి వాటిని వదిలేసి, ‘నాట్’ను ఉపయోగించాలని సూచించింది.

పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పురుషులు ఈ యాప్‌లో పేర్లు నమోదు కావడానికి సంవత్సరానికి రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉండాలని పేర్కొంది. మహిళలు మాత్రం ఆదాయం లేకపోయినా ఉచితంగా ఈ యాప్‌లో పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది.

Also Read: అయ్యో పాపం.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిన స్టార్ ప్లేయర్.. వీల్‌చైర్ సహాయంతో తీసుకొచ్చిన సిబ్బంది.. వీడియో వైరల్.. అసలు ఏమైందంటే?

“ఇది భారతీయులందరి కోసం కాదు, అగ్రస్థానంలో ఉండే 1% పురుషుల కోసమే. ఇది అంతా గోల్డ్ డిగ్గర్ సెంట్రల్‌లా ఉంది కదా? అంటే నేరుగా వెళ్లి ధనవంతుడైన భర్తను షాపింగ్ చేయొచ్చు” అని సెటైర్ వేస్తూ తన్యా చెప్పింది.

“ఇలాంటి యాప్‌ను సృష్టించాలన్న ఆలోచన ఎవరిది? మహిళలు బంగారాన్ని తవ్వుకునే (ధనవంతుడైన భర్తను వెతుక్కునే) యాప్‌ని పురుషులు ఇంత నిర్భయంగా నడుపుతున్నారు. ఆ ఆలోచన ఎవరికి వచ్చిందంటే పురుషులకే. ఇద్దరు పురుషులు ఈ యాప్‌ను రూపొందించారు. కాబట్టి ‘గోల్డ్ డిగ్గర్స్‌కి (ధనవంతుడైన భర్తను వెతుక్కునే అమ్మాయిలకు) గోల్డ్ లేని పురుషులే ఎక్కువ’ అనే సిద్ధాంతం ఇప్పుడు నిజమైంది” అని తన్యా పేర్కొంది.

మహిళలను గోల్డ్ డిగ్గర్లు (ధనదాహం ఉన్నవారు) అని వెటకారం చేసే పురుషులే ఈ యాప్‌ను రూపొందించారని ఆమె సెటైర్లు వేసింది. ఇలాంటి పురుషులకే డబ్బు ఉండదు.. కానీ, వారు మహిళలను ధనదాహం ఉన్నవారంటూ విమర్శిస్తారు. ఈ యాప్ ఆ వాస్తవాన్ని బయటపెట్టిందని ఆమె ఉద్దేశం.