Rahmat Shah : అయ్యో పాపం.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిన స్టార్ ప్లేయర్.. వీల్‌చైర్ సహాయంతో తీసుకొచ్చిన సిబ్బంది.. వీడియో వైరల్.. అసలు ఏమైందంటే?

Rahmat Shah : బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్గనిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా ఆఫ్గనిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.

Rahmat Shah : అయ్యో పాపం.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిన స్టార్ ప్లేయర్.. వీల్‌చైర్ సహాయంతో తీసుకొచ్చిన సిబ్బంది.. వీడియో వైరల్.. అసలు ఏమైందంటే?

Rahmat Shah

Updated On : October 12, 2025 / 2:27 PM IST

Rahmat Shah : బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్గనిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా ఆఫ్గనిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన స్టార్ బ్యాటర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని వీల్‌చైర్‌లో గ్రౌండ్ బయటకు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఆఫ్గాన్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గన్ జట్టు.. 44.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు తడబడింది. దీంతో 28.3 ఓవర్లలోనే 109 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆఫ్గన్ జట్టు 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ.. ఆఫ్గన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్ రహమత్ షా తీవ్ర గాయంతో సిరీస్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.

Also Read: Asia Cup Trophy : అట్లుంటది మనతోని.. ఆసియా కప్ ట్రోఫీ ఎత్తుకెళ్లిన నఖ్వీకి బిగ్ షాక్..

మ్యాచ్ సందర్భంగా నాలుగో వికెట్‌కు బరిలోకి దిగిన రహమత్ షా గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. అతనికి పిక్క కండరాలు పట్టేశాయి. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అఫ్గాన్ చివరి వికెట్ పడిన తరువాత జట్టు స్కోర్ పెంచే ఉద్దేశంతో రహమత్ నొప్పిని భరిస్తూనే మైదానంలోకి వచ్చాడు. కానీ, క్రీజులో నిలబడలేక పోయాడు.

కేవలం ఒక్క బంతిని మాత్రమే ఎదుర్కొన్న రహమత్.. తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీంతో అఫ్గాన్ ఫిజియో నిర్మలన్ థనబలసింగం మైదానంలోకి వచ్చి ఆయనకు చికిత్స అందించాడు. కానీ, నొప్పి ఎక్కువ కావడంతో వీల్ చైర్ ద్వారా అతన్ని గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను అఫ్గాన్ క్రికెట్ బోర్డు తమ అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది.


బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్ జట్ల మధ్య మూడో వన్డే అక్టోబర్ 14వ తేదీన జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు రహమత్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువే. ప్రస్తుతం అఫ్గాన్ జట్టులో రహమత్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇటీవలే రహ్మత్ షా 4వేల వన్డే పరుగులు కూడా పూర్తి చేశారు. తద్వారా 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి అఫ్గాన్ బ్యాటర్‌గా నిలిచాడు. అలాంటి బ్యాటర్ జట్టుకు దూరమవ్వడం అఫ్గాన్ జట్టు ఇబ్బందికర విషయమే.