Asia Cup Trophy : అట్లుంటది మనతోని.. ఆసియా కప్ ట్రోఫీ ఎత్తుకెళ్లిన నఖ్వీకి బిగ్ షాక్..
Asia Cup Trophy : ఆసియా కప్ -2025 ట్రోపీని భారత్‌కు అప్పగించకుండా.. దొంగలా తీసుకెళ్లిన మొహ్సిన్ నఖ్వీకి బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.

Asia Cup Trophy
Asia Cup Trophy : ఆసియా కప్ -2025 ట్రోపీని భారత్‌కు అప్పగించకుండా.. దొంగలా తీసుకెళ్లి ఏసీసీ కార్యాలయంలో దాచుకున్న ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీకి బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. బీసీసీఐతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించేలా ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలో మొహ్సిన్ నఖ్వీని ఐసీసీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించేందుకు పావులు కదుపుతోందని, ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. పహల్గాం దాడికి ఖండనగా ఇండియా ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్‌తోపాటు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. మూడు సార్లు కూడా పాకిస్థాన్ జట్టును టీమిండియా చిత్తు చేసింది.
ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన తరువాత.. ట్రోఫీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా ఉన్న ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు టీమిండియా అంగీకరించలేదు. దీంతో నఖ్వీ ట్రోఫీని భారత్‌కు ఇవ్వకుండా దొంగతనంగా తీసుకెళ్లి ఏసీసీ కార్యాలయంలో దాచుకున్నాడు.
నఖ్వీ తీరుపై బీసీసీఐ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇప్పటికే అతని తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ట్రోఫీని ఇవ్వకుండా తీసుకెళ్లినందుకు భారత జట్టుకు నఖ్వీ క్షమాపణలు చెప్పాడు.. అయినా ట్రోఫీ మాత్రం ఇంకా అప్పగించలేదు. బీసీసీఐ లేదా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేరుగా ఏసీసీ కార్యాలయంకు వచ్చి తన చేతులమీదుగా ట్రోఫీని తీసుకోవాలని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికీ ఆసియా కప్ ట్రోపీ ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. నా అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికి అప్పగించొద్దని తన సిబ్బంది నఖ్వీ ఆదేశాలు జారీ చేశారట. నఖ్వీ తీరుపై బీసీసీఐ ఆగ్రహంతో ఉంది. దీంతో అతని గట్టి గుణపాఠం చెప్పలా బీసీసీఐ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
నఖ్వీ ధోరణి ఇలాగే కొనసాగితే ఐసీసీ బోర్డు డైరెక్టర్‌గా అతన్ని తొలగించేలా బీసీసీఐ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తాజా పరిణామాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, నఖ్వీ మున్ముందు ఎలా ప్రవర్తిస్తారనేది చూడాలి.