Words Banned In Parliament : వద్దు అన్న పదాలనే పార్లమెంట్ లో వాడుతా..కావాలంటే సస్పెండ్ చేస్కోండి : TMC MP

జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో లోక్ సభ, రాజ్య సభల్లో కొన్ని పదాలను నిషేధిస్తూ లోక్ సభ సెక్రటేరియెట్ తాజాగా కొత్త బుక్ లెట్ ను విడుదల చేసింది. కానీవాడొద్దు అనే పదాలనే పార్లమెంట్ లో వాడతానని కావాలంటే తనను సస్పెండ్ చేస్కోండీ అంటూ సవాల్ విసిరారు టీఎంసీ ఎంపీ డెరిక్.

Words Banned In Parliament..tmc Mp Derek Challenges Parliaments Censor Order

Words Banned In Parliament: జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో లోక్ సభ, రాజ్య సభల్లో కొన్ని పదాలను నిషేధిస్తూ లోక్ సభ సెక్రటేరియెట్ తాజాగా కొత్త బుక్ లెట్ ను విడుదల చేసింది. జుమ్లాజీవి, కొవిడ్ స్ర్పైడర్, స్నూప్ గేట్ వంటి పదాలు కూడా ఉన్నాయి. అంతేకాక సాధారణంగా వాడే సిగ్గుచేటు, వేధించడం, మోసగించడం, అవినీతిపరుడు, డ్రామా, హిపోక్రసీ, నియంత అనే పదాలతో పాలు మరికొన్ని పదాలను ఉపయోగించవద్దని బుక్ లెట్ లో పేర్కొంది.

బుక్ లెట్ లో పేర్కొన్న పదాలను వాడకూడదనే సూచలను వెలువడిన అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పదాలు వాడకూడదు అని సూచలను ఆయన ఖండించారు. సాధారణ పదాలను కూడా అన్ పార్లమెంటరీ పదాలుగా పేర్కొనడం సరికాదని..తాను మాత్రం ‘సాధారణ’ పదాలను సభలో ఉపయోగిస్తానని స్పష్టం చేస్తూ..కావాలంటే లోక్ సభ స్పీకర్ నన్ను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు.

కాగా..జులై 18 నుంచి జరిగే లోక్ సభ, రాజ్య సభ వర్షాకాల సమావేశాల్లో సభ్యులు కొన్ని పదాలు వాడకూడదంటూ లోక్ సభ సెక్రటేరియట్ బుధవారం ఓ బుక్ లెట్ ను విడుదల చేసింది. ఈ అంశంపై ఎంపీ డెరెక్ అసహనం వ్యక్తంచేశారు. ఆ ఆదేశాలను ధిక్కరిస్తానని కావాలంటే తనను సభ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ ట్వీట్ చేశారు.

పార్లమెంటులో మాట్లాడుతున్న సమయంలో కొన్ని పదాలు వస్తుంటాయనీ..’సిగ్గుపడుతున్నాను.. దుర్వినియోగం చేశారు.. ద్రోహం చేశారు.. అవినీతిపరుడు.. వంచన.. అసమర్థుడు’ వంటి పదాలను ఉపయోగించడానికి మాకు అనుమతి లేదట.. కానీ నేను ఈ పదాలన్నింటినీ ఉపయోగిస్తాను.కావాలంటే నన్ను సస్పెండ్ చేయండి. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటా’’ అని ఎంపీ డెరెక్ స్పష్టం చేశారు.

బుల్ లెట్ లో పేర్కొన్న పదాలు..
బుక్ లెట్ లో జుమ్లాజీవి, కొవిడ్ స్ర్పైడర్, స్నూప్ గేట్ వంటి పదాలు కూడా ఉన్నాయి. అంతేకాక సాధారణంగా వాడే సిగ్గుచేటు, వేధించడం, మోసగించడం, అవినీతిపరుడు, డ్రామా, హిపోక్రసీ, నియంత అనే పదాలను కూడా ఉపయోగించవద్దని బుక్ లెట్ లో పేర్కొనడం గమనార్హం. పార్లమెంట్ నిషేధిత పదాల జాబితాలో.. శకుని, తానాషా, వినాశ పురుష్, ఖలిస్థానీ, ద్రోహ చరిత్ర, చంచా, చంచాగిరి, పికిరివాడు, క్రిమినల్, మొసలి కన్నీళ్లు, గాడిద, అసమర్థుడు, గూండాలు, అహంకారి, చీకటి రోజులు, దాదాగిరి, లైంగిక వేధింపులు, విశ్వాస ఘాతకుడు వంటి పదాలను కూడా సభ్యులు తమ ప్రసంగాల్లో ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే.. రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న పదాలను సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు.