MK Stalin: నెహ్రూ వారసుడి మాటలు గాడ్సే వారసుల్ని కలవరపెడుతున్నాయి

శనివారం తమిళనాడు కాంగ్రెస్ నేత గోబన్న రాసిన ‘మమనిథర్ నెహ్రూ’ అనే పుస్తకావిష్కరణకు స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నెహ్రూ ఒకే భాష విధానాన్ని వ్యతిరేకించారు. అలాగే ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే చట్టం వంటి వాటిని కూడా వ్యతిరేకించారు. ఆయన దేశానికి ప్రధానమంత్రిగా పని చేశారు. దేశ ప్రజలందరి ప్రధానమంత్రిగా పని చేశారు’’ అని అన్నారు.

MK Stalin: దేశ మొదటి ప్రధానమంత్రి జవహార్‭లాల్ నెహ్రూపై భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెహ్రూ గుర్తింపును, సేవల్ని దేశం పదిలపర్చుకోవాలని ఆయన సూచించారు. అలాగే స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మ గాంధీ సూచన చేసినట్లు బీజేపీ నేతలు పదే పదే చెప్తుంటారు. అయితే వాటిని ఊటంకిస్తూ గాంధీ తన రాజకీయ వారసుడిగా నెహ్రూని ప్రకటించారని, ఈ విషయాన్ని గుర్తు పెట్లుకోవాలని స్టాలిన్ అన్నారు.

Bihar: భూ తగాదా.. ఐదుగురు మహిళలపై కిరాతకంగా కాల్పులు జరిపిన ఓ వ్యక్తి

ఇక రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై బీజేపీ విమర్శలను తిప్పి కొడుతూ నెహ్రూ వారసుడి మాటలు గాడ్సే వారసుల్ని కలవరపెడుతున్నాయంటూ చురకలు అంటించారు. శనివారం తమిళనాడు కాంగ్రెస్ నేత గోబన్న రాసిన ‘మమనిథర్ నెహ్రూ’ అనే పుస్తకావిష్కరణకు స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నెహ్రూ ఒకే భాష విధానాన్ని వ్యతిరేకించారు. అలాగే ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే చట్టం వంటి వాటిని కూడా వ్యతిరేకించారు. ఆయన దేశానికి ప్రధానమంత్రిగా పని చేశారు. దేశ ప్రజలందరి ప్రధానమంత్రిగా పని చేశారు’’ అని అన్నారు.

Rahul Gandhi: చైనా, పాక్ ఒక్కటయ్యాయి, ఒకవేళ యుద్ధం వస్తే.. రాహుల్ గాంధీ

ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ ‘‘రాహుల్ యాత్రకు ప్రజల మద్దతు పెద్ద ఎత్తున లభిస్తోంది. ఎన్నికల రాజకీయాల గురించి రాహుల్ మాట్లాడడం లేదు. సిద్ధాంతపరమైన రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకే కొంత మంది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రాహుల్ ప్రసంగాలు చాలా వరకు జవహర్‌లాల్ నెహ్రూలానే ఉంటాయి. కొంత మందికి ఇవి ఎంత మాత్రం గిట్టడం లేదు. బహుశా నెహ్రూ వారసుడి మాటలు గాడ్సే వారసుల్ని కలవర పెడుతున్నట్లు ఉన్నాయి’’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు