Uttarakhand Uttarkashi : సొరంగంలోనే కార్మికులు.. వాళ్లు బయటకు రావాలంటే డిసెంబర్ చివరి వారం వరకు సమయం పడుతుందా?

అధికారులు రెండు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. మిగిలిఉన్న 10 మీటర్ల విస్తీర్ణంలో మాన్యువల్ డ్రిల్లింగ్ చేయడం. అలాకాకుంటే 86 మీటర్ల దిగువకు డ్రిల్లింగ్ చేయడం.

Uttarkashi

Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 15 రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నా సాంకేతిక కారణాల వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. గురువారం అమెరికన్ ఆగర్ యంత్రం మొరాయించడంతో పనులు నిలిపివేసిన అధికారులు.. మరుసటి రోజు వాటిని మళ్లీ స్టార్ట్ చేశారు. అయితే.. శుక్రవారం డ్రిల్లింగ్ మొదలు పెట్టిన కొంతసేపటికే భారీ యంత్రం మెటల్ గిర్డర్‌ను తాకడంతో మెషీన్ చాలా వరకు దెబ్బతింది. దీంతో ఆగర్ యంత్రంతో పనులు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలపై నిపుణులు దృష్టి సారించారు.

Also Read : PM Modi : కన్హా శాంతివనంకు ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..
అధికారులు రెండు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. మిగిలిఉన్న 10 మీటర్ల విస్తీర్ణంలో మాన్యువల్ డ్రిల్లింగ్ చేయడం. అలాకాకుంటే 86 మీటర్ల దిగువకు డ్రిల్లింగ్ చేయడం. అధికారులు మాత్రం కొండ పైనుంచి డ్రిల్లింగ్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డ్రిల్లింగ్ సైట్ కోసం రహదారిని సైతం సిద్ధం చేశారు. ఈ దారి గుండా అతిపెద్ద డ్రిల్లింగ్ మిషన్‌ను ఇప్పటికే కొండపైకి తీసుకెళ్లారు. అక్కడ ఫ్లాట్‌ఫాంను బలోపేతం చేసిన తర్వాత సొరంగం తవ్వే పనులు ప్రారంభించనున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అలా హస్సైన్ ఢిల్లీలో మాట్లాడారు.. ఆపరేషన్ చాలా సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. మరికొందరు నిపుణులు టన్నెల్ లో ఇరుక్కున్న వారు బయటకు రావటానికి సమయం పడుతుందని పేర్కొంటున్నారు. డిసెంబర్ నెల చివరి నాటికి అంటే క్రిస్మస్ పండుగ నాటికి కార్మికులు టన్నెల్ నుంచి బయటకు వస్తారని అంచనా వేశారు.

Also Read : CM KCR : సీఎం కేసీఆర్ కు ఈసీ నోటీసులు.. ప్రజలను రెచ్చ గొట్టే విధంగా ప్రసంగించొద్దని హెచ్చరిక

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడుతూ.. శిథిలాల్లో ఇరుక్కుపోయిన ఆగర్ బ్లేడ్లను కత్తిరించేందుకు ప్లాస్మా కట్టర్ ను వినియోగించాలి. దాన్ని హైదరాబాద్ నుంచి విమాన మార్గంలో తీసుకొస్తున్నాం. అది వచ్చాక మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు.

 

 

ట్రెండింగ్ వార్తలు