ప్రపంచ జనాభా దినోత్సవం 2020: మన దేశ జనాభా 307 కోట్లు ఉండేది!

  • Publish Date - July 11, 2020 / 10:24 AM IST

ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని తొలిసారి 11 జూలై 1989 న ప్రకటించారు. 1987లో దేశ జనాభా సంఖ్య 5 బిలియన్లుగా ఉన్నప్పుడు, పెరుగుతున్న జనాభాకు సంబంధించిన సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.

ఈ రోజున జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అనేక కార్యకలాపాలు జరుగుతాయి. తద్వారా ప్రజలకు అవగాహన ఏర్పడి జనాభాను నియంత్రించవచ్చు అనేది అభిప్రాయం. ప్రపంచంలోని అనేక దేశాల ముందు జనాభా పెరుగుదల పెద్ద సమస్య రూపంలో ఉంది.

‘జనాభా పెరుగుదల’ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో తీవ్ర ఆందోళన కలిగించే విషయం. భారతదేశంలో కూడా జనాభా పెరుగుదల అనేది సమస్యగా ఉంది. దేశంలో కుటుంబ నియంత్రణ లేకపోతే, నేడు మన జనాభా 307 కోట్లకు పైగా ఉండేదని నిపుణులు అంచనా వేశారు.

వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో జనాభాపై పరిశోధనలు చేస్తున్న జెఎన్‌యూ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ గోలీ పరిశోధన ప్రకారం 1990 నుంచి 2016 వరకు భారతదేశంలో 169 కోట్ల మంది పిల్లలు పుట్టేవారని చెప్పారు. అంటే, నేటి జనాభా 138 కోట్లు కాదు 307 కోట్లుగా ఉండేది.

కుటుంబ నియంత్రణ 2016 నుంచి 2061 వరకు 45 సంవత్సరాలలో దేశంలో 1.90 బిలియన్ ప్రజలను నిరోధిస్తుందని ప్రొఫెసర్ గోలీ చెప్పారు. జనాభా నియంత్రణ బలవంతపు విధానాల గురించి చింతిస్తున్నట్లు ఆయన చెప్పారు. యూరప్, జర్మనీ, జపాన్‌లో జనాభా పెరగట్లేదు. ఆ దేశాలలో పిల్లలను ప్రసవించడానికి ప్రోత్సహిస్తున్నారు.

జనాభా గణనలో సరైన జనాభా భర్తీ సంతానోత్పత్తి సూత్రం చాలా ముఖ్యమైనది. ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాలలో పని చేయడానికి తగినంత మంది లేరు. ఈ దేశాలలో భారతదేశం నుండి నర్సులు లేకపోతే అక్కడ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పడిపోతుంది. అందుకే ఇద్దరు పిల్లల వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. 2061 నాటికి, భారతదేశంలో జనన రేటు 1.8 కన్నా తక్కువగా ఉంటుందని అంచనా.