World Toilet Day 2020 : ఎవర్నీ అడగక్కర్లా..దగ్గర్లో పబ్లిక్ టాయిలెట్ ఎక్కడుందో ఇలా తెలుసుకోండీ

: నవంబర్ 19 వాల్డ్ టాయిలెట్ డే (World Toilet Day)ఇటువంటి ఓ రోజు ఉందని చాలామందికి తెలీదు. అన్నింటికీ ఓ రోజు ఉన్నప్పుడు స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి రోజు ఉండటం చ

World Toilet Day 2020 : నవంబర్ 19 వాల్డ్ టాయిలెట్ డే (World Toilet Day)ఇటువంటి ఓ రోజు ఉందని చాలామందికి తెలీదు. అన్నింటికీ ఓ రోజు ఉన్నప్పుడు స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి రోజు ఉండటం చాలా మంచిదే. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఎక్కడ పడితే అక్క మూత్ర విజర్జన చేయటం విచారించాల్సిన  విషయం. ఇది అపరిశుభ్రతకు కారణంగా మారుతోంది.




కానీ టెక్నాలజీని ఉపయోగించి పబ్లిక్ టాయిలెట్ ఎక్కడ ఉందో మీ స్మార్ట్‌ఫోన్‌తో ఈజీగా తెసుకోవచ్చు. గూగుల్‌లో మీకు దగ్గర్లో పబ్లిక్ టాయిలెట్ ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పరిశుభ్రతను పెంచుదాం.




బయట ఏదో పనిమీద వస్తాం. ఆ సమయంలో టాయిలెట్ అవసరం పడుతుంది. కానీ దగ్గర్లో టాయిలెట్ ఎక్కడుందో తెలీదు. ఎవరినన్నా అడగాలంటే సిగ్గు. కానీ ఇప్పుడు అటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీకు దగ్గర్లో పబ్లిక్ టాయిలెట్ ఎక్కుడుందో తెలుసుకోవచ్చు.



సులభ్ కాంప్లెక్స్‌లు, ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే టాయిలెట్స్ ఉన్నా, అవి ఎక్కడ ఉన్నాయో తెలియక ఇబ్బంది పడుతుంటారు చాలామంది. ముఖ్యంగా సామాన్యులకు ఇటువంటి ఇబ్బంది వస్తుంటుంది.

ఇకపై అలా టాయిలెట్ కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. దాని కోసం ఏం చేయాలంటే.. మీ ఫోన్‌లో గూగుల్ బ్రౌజ్ చేయగలిగితే చాలు. దగ్గర్లో ఎక్కడెక్కడ టాయిలెట్స్ ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు.




గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ‘public toilets near me’ అని టైప్ చేస్తే చాలు. మీకు దగ్గర్లో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ ఆ లొకేషన్‌తో సహా మీకు తెలిసిపోతాయి. ఇదే ప్రశ్న గూగుల్ అసిస్టెంట్‌ని అడిగినా అడ్రస్ వెంటనే తెలిసిపోతుంది.





కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, స్వచ్ఛ్‌ భారత్ మిషన్‌ సహకారంతో టెక్ దిగ్గజ అయిన గూగుల్ 2016లో ఈ పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్లను గూగుల్ మ్యాప్స్‌లో సులువుగా గుర్తించేలా చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. తద్వారా ప్రజలకు సమాచారం అందించటం..తద్వారా పరిశుభ్రతను పెంచటం కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా చేపట్టింది.

ట్రెండింగ్ వార్తలు