Bamboo Crash Barrier: బంబూ కర్రలతో రోడ్డు బారియర్.. వైరల్ అవుతున్న ఫొటోలు

ఇలాంటి నిర్మాణం ప్రపంచంలోనే మొదటిదని, ఈ క్రాష్ బ్యారియర్ ఉక్కుకు సరైన ప్రత్నామ్యాయమని, పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన వెల్లడించారు. వెదురు క్రాష్ బారియర్ రీసైక్లింగ్ విలువ 50 నుంచి 70 శాతం ఉంటుందని, దీనితో పోల్చుకుంటే ఉక్కు బారియర్ల రీసైక్లింగ్ విలువ 30 నుంచి 50 శాతం ఉందని ఆయన అన్నారు

Bamboo Crash Barrier: రోడ్డు బారియర్‭లు ఇనుప కంచెలతో ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఫైబర్, ప్లాస్టిక్ లాంటివి కూడా వాడుతున్నారు. కానీ మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన బారియర్ చూడడానికి ఆకట్టుకోవడమే కాకుండా, పర్యావరణ హిత జాబితాలో ప్రపంచ రికార్డు సాధించేసింది. కేంద్ర రహదారుల-రవాణా మంత్రి నితిన్ గడ్కరి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అన్నట్లు ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఆయనే.

Arvind Kejriwal: నా కొడుకునైనా సరే జైలుకు పంపిస్తాను.. కర్ణాటక ప్రచారంలో కేజ్రీవాల్

పూర్తిగా వెదురుతో తయారు చేసిన 200 మీటర్ల పొడవైన క్రాష్ బారియర్‌ను మహారాష్ట్రలోని ఓ హైవేపై ఏర్పాటు చేశారు. ఈ తరహాలో క్రాషి బారియర్ ఏర్పాటు చేయడటం ప్రపంచంలోనే ఇది మొదటిదని గడ్కరి తెలిపారు. రాష్ట్రంలోని చంద్రపూర్-యవత్మాల్ జిల్లాలను అనుసంధానించే హైవేపై ఈ బాంబూ క్రాష్ బారియన్‌ను ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఫొటోలు ఆయన షేర్ చేస్తూ ”ఇది దేశానికి, వెదురు రంగానికి గొప్ప విజయం. వణి-వరోరా హైవేపే ప్రపంచంలోనే మొట్టమొదటి 200 మీటర్ల పొడవైన వెదురు క్రాష్ బ్యారియర్‌తో అత్మనిర్భర్ భారత్‌ను సాధించే దిశగా అసాధారణ విజయం సాధించాం” అని గడ్కరి వరుస ట్వీట్లు చేశారు.

CJI Chandrachud: తప్పుడు వార్తల ప్రవాహంలో నిజం బలిపశువుగా మారుతోంది.. సీజేఐ చంద్రచూడ్

ఇలాంటి నిర్మాణం ప్రపంచంలోనే మొదటిదని, ఈ క్రాష్ బ్యారియర్ ఉక్కుకు సరైన ప్రత్నామ్యాయమని, పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన వెల్లడించారు. వెదురు క్రాష్ బారియర్ రీసైక్లింగ్ విలువ 50 నుంచి 70 శాతం ఉంటుందని, దీనితో పోల్చుకుంటే ఉక్కు బారియర్ల రీసైక్లింగ్ విలువ 30 నుంచి 50 శాతం ఉందని ఆయన అన్నారు. బాంబుసా బాల్కోవా వెదురుకు క్రియేసాట్ నూనెతో శుద్ధి చేసి రీసైకిల్డ్ హై-డెన్సిటీ పోలీ ఇథిలీన్‭తో పూత పూసి తయారు చేసినట్టు తెలిపారు. ఇది ఉక్కుకు ప్రత్యామ్నాయమే కాకుండా, పర్యవారణ ఆందోళనలకు పరిష్కారమని అన్నారు. వెదురు రంగంతో పాటు యావత్ భారతదేశం గుర్తించిదగిన విజయమిదని తెలిపారు. గ్రామీణ, అగ్రికల్చర్-ఫ్రెండ్లీ ఇండస్ట్రీగా ఇది మరింత కీలకమైన మైలురాయని గడ్కరి అభివర్ణించారు.

ట్రెండింగ్ వార్తలు