Arvind Kejriwal: నా కొడుకునైనా సరే జైలుకు పంపిస్తాను.. కర్ణాటక ప్రచారంలో కేజ్రీవాల్

ఢిల్లీలో మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు. ఢిల్లీ-పంజాబ్‌లో నిజాయితీగా పని చేస్తున్నాము. కర్ణాటకలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతోంది. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రెండింతల అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రానికి కొత్త ఇంజన్ ప్రభుత్వం అవసరం. ఎమ్మెల్యేలు ఇక్కడ అమ్ముడుపోయారు. అలానే బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.

Arvind Kejriwal: నా కొడుకునైనా సరే జైలుకు పంపిస్తాను.. కర్ణాటక ప్రచారంలో కేజ్రీవాల్

Corruption doubles in double-engine govt, says Kejriwal

Arvind Kejriwal: కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత కుమారుడు 8 కోట్ల రూపాయలతో పట్టుబడటీన్ని ప్రస్తావిస్తూ వచ్చే ఏడాది అతడికి పద్మభూషణ్ వస్తుందేమో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కమల పార్టీ ప్రభుత్వం కరప్షన్ ప్రభుత్వమని, అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆయన కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇస్తే అవినీతి లేని ప్రభుత్వాన్ని కన్నడ ప్రజలకు అందిస్తామని, అవినీతికి పాల్పడితే తన కొడుకునైనా జైలుకు పంపిస్తానని కేజ్రీవాల్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు తొందరలో రాబోతున్నందున శనివారం ఆయన రాష్ట్రంలోని దావణగెరెలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.

Manish Sisodia Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

ఈ సమావేశానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం హాజరయ్యారు. ఇక ఆ సమావేశాన్ని ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగిస్తూ బీజేపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.‘‘కర్ణాటకలోని దావణగెరెలో బీజేపీ నేత కుమారుడు రూ.8 కోట్లతో పట్టుబడ్డారు. అతన్ని అరెస్టు చేయలేదు. బహుశా వచ్చే ఏడాది అతనికి పద్మభూషణ్ ఇవ్వవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లో ఏమీ దొరకలేదు. అయినా ఆయన జైలులో ఉన్నారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.

Mamata Alone Fight in 2024: కూటమి ప్రయత్నాలకు షాకిచ్చిన మమతా బెనర్జీ.. ఓటములొచ్చినా ఒంటరి పోరేనట

‘‘ఢిల్లీలో మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు. ఢిల్లీ-పంజాబ్‌లో నిజాయితీగా పని చేస్తున్నాము. కర్ణాటకలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతోంది. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రెండింతల అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రానికి కొత్త ఇంజన్ ప్రభుత్వం అవసరం. ఎమ్మెల్యేలు ఇక్కడ అమ్ముడుపోయారు. అలానే బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆప్‌లో ఎవరు అవినీతి చేసినా జైలుకు వెళ్తారు, నా కొడుకు అవినీతి చేస్తే జైలుకు కూడా వెళ్తాడు’’ అని కేజ్రీవాల్ అన్నారు.