Mamata Alone Fight in 2024: కూటమి ప్రయత్నాలకు షాకిచ్చిన మమతా బెనర్జీ.. ఓటములొచ్చినా ఒంటరి పోరేనట

కొన్ని సందర్భాల్లో ఊహించని వ్యక్తులు సీఎంలు, పీఎంలు అయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రధాన పార్టీలు తక్కువ స్థానాలు గెలిచిన పార్టీలను ఆశ్రయిస్తాయి. అలా ఆశ్రయించిన సందర్భాల్లో చిన్న పార్టీలు అధికార కుర్చీని స్వాధీనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ అలాగే అయ్యారు.

Mamata Alone Fight in 2024: కూటమి ప్రయత్నాలకు షాకిచ్చిన మమతా బెనర్జీ.. ఓటములొచ్చినా ఒంటరి పోరేనట

Will fight alone in 2024 says Mamata

Mamata Alone Fight in 2024: రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కూటమికి వ్యతిరేకంగా భారీ కూటమిని ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు గట్టిగానే సాగుతున్నాయి. భావ సారూప్యత కలిగిన పార్టీలన్నింటినీ కలుపుకుని పోతామని జాతీయ స్థాయిలో పట్టున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రకటనలు చేస్తుండగా, విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేస్తానంటూ మరొకవైపు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే 2018 నాటి నుంచే ఫెడరల్ ఫ్రంట్ అని ఊదరగొడుతున్నారు. అయితే ఇప్పటికీ ఆయన చేసింది ఏమీ లేదు కానీ, తాజాగా ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త జాతీయ పార్టీగా భారత్ రాష్ట్ర సమితి అని మార్చారు.

Bill Gates: ప్రధాని మోదీతో భేటీ తరువాత బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌పై పొగడ్తల వర్షం

ఇంతటి ప్రయత్నాల్లో ఉన్న నేతలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమె ప్రకటించారు. దీంతో కాంగ్రెస్, నితీశ్, కేసీఆర్ కూటములే కాకుండా మరే కూటమిలో చేరబోనని ఆమె చెప్పకనే చెప్పారు. వాస్తవానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మూడోసారి వరుసగా ఘన విజయం సాధించిన అనంతరం.. విపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిగా మమత అయితే బాగుంటుందనే చర్చ లేసింది. దానికి అనుగుణంగానే మమత సైతం పార్టీని వివిధ రాష్ట్రాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే సీట్లు సరికదా.. ఓట్లు కూడా సరిగా రాకపోవడంతో ఆ ప్రయత్నాలను మానుకున్నారు.

Vikarabad Student Died : 3వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి.. టీచర్ కొట్టడం వల్లే చనిపోయాడని తల్లిదండ్రుల ఆరోపణ

రెండోసారి సీఎం అయిన అనంతరం నాటి నుంచే మమతను ప్రధాని అభ్యర్థిగా కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు ఆమెకు లేకపోలేదు. కానీ, తనకు తాను ఎప్పుడూ బయటికి వెల్లడించలేదు. అయితే కూటమికి కడితే అందులో మమత భాగస్వామి అవుతారనే అంచనాలు మాత్రం ఉండేది. కారణం, 2018 నాటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీయేతర పార్టీలు ఒక వేదిక మీద కనిపించాయి. ఆ వేదికను మమత కూడా పంచుకున్నారు. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి మద్దతుగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి మద్దతుగా ప్రచారం చేశారు. పలు సందర్భాల్లో విపక్షాల ఐక్యత గురించి మాట్లాడారు. అలాగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కేజ్రీవాల్, అఖిలేష్, తేజస్వీ వంటి వారిని పిలిపించుకుని ప్రచారం చేయించుకున్నారు. ఇలాంటి కారణాల దృష్ట్యా.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాడే యూపీఏ కూటమికి కానీ మూడో కూటమికి కానీ మమత మద్దతు ఇస్తారనే అనుకున్నారు. కానీ తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని ప్రకటించి ఆమె బాంబ్ పేల్చారు.

విజయవంతమైన గ్లోబల్ ఇన్వెస్ట్‭మెంట్ సమ్మిట్.. ఏపీకి వెల్లువెత్తిన పెట్టుబడులు

ఓటములు వచ్చినా ఒంటరి పోటీకే సై..
బెంగాల్‭లో మూడోసారి విజయం సాధించిన అనంతరం.. గోవా, త్రిపుర వంటి రాష్ట్రాల్లో తమ ప్రభావం చూపుకోవాలని మమత చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి కనీస ఓట్లు కూడా రాలేదు. దీంతో జాతీయ స్థాయిలో విస్తరించాలనుకునే తన ప్రయత్నాలకు మమత స్వస్తి చెప్పారు. దీంతో విపక్ష కూటమిలో చేరడం తప్పితే మమతకు వేరే ఛాన్స్ లేకుండా పోయిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ-కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయ వైరం ఉంది. కాబట్టి యూపీఏలో చేరే అవకాశాలు తక్కువే. అయితే నితీశ్ కూటమితో ఆమె జతకట్టొచ్చని అన్నారు. ఆ మధ్య కేసీఆర్ అయితే కలకత్తా వెళ్లి దీదీని కలిసి వచ్చారు. కానీ ఎవరితో కలిసి వెళ్లేందుకు ఆమె ఆసక్తి చూపడం లేదు. బెంగాల్ రాష్ట్రానికి పరిమతమై, అక్కడే తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆమె ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థం అవుతోంది.

Manish Sisodia Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

కింగ్ మేకర్ వంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?
కొన్ని సందర్భాల్లో ఊహించని వ్యక్తులు సీఎంలు, పీఎంలు అయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రధాన పార్టీలు తక్కువ స్థానాలు గెలిచిన పార్టీలను ఆశ్రయిస్తాయి. అలా ఆశ్రయించిన సందర్భాల్లో చిన్న పార్టీలు అధికార కుర్చీని స్వాధీనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ అలాగే అయ్యారు. ఇక ఆయన కుమారుడే 2018లో ముఖ్యమంత్రి అయిన సందర్భాన్ని కూడా మర్చిపోలేము. గత ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి సైతం ఇదే ఆశతో ఉన్నారు. ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీ చేశాయి. అయితే బీజీపీ, కాంగ్రెస్ పార్టీల కూటములకు స్పష్టమైన మెజారిటీ రాకపోతే చక్రం తిప్పే ఆలోచనలో ఉన్నట్లు మాయావతి నేరుగానే చెప్పారు. కానీ ఎన్డీయేకు భారీ మెజారిటీ రావడంతో ఆమె ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రస్తుతం మమతా బెనర్జీ అదే ఆలోచనలో ఏమైనా ఉందేమోనని అంటున్నారు.