Vikarabad Student Died : 3వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి.. టీచర్ కొట్టడం వల్లే చనిపోయాడని తల్లిదండ్రుల ఆరోపణ

వికారాబాద్ జిల్లాలో మూడో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పూడూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో ఘటన చోటు చేసుకుంది.

Vikarabad Student Died : 3వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి.. టీచర్ కొట్టడం వల్లే చనిపోయాడని తల్లిదండ్రుల ఆరోపణ

BOY

Vikarabad Student Died : వికారాబాద్ జిల్లాలో మూడో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పూడూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో ఘటన చోటు చేసుకుంది. టీచర్ కొట్టడం వల్లే మరణించినట్లు తల్లీదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు చితకబాదడంతో 3వ తరగతి చదువుతున్న విద్యార్థి కార్తీక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

అయితే టీచర్ కొట్టడం వల్లే తమ కుమారుడు చనిపోయినట్లు బాలుడి తల్లీదండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా, స్కూల్ యాజమాన్యం మాత్రం కార్తీక్ బెడ్ పైనుంచి కింద పడటంతో తల్లీదండ్రులు ఇంటికి తీసుకెళ్లారని చెప్పింది. స్టూడెంట్ వారి ఇంటి వద్దే మృతి చెందాడని కేశవ రెడ్డి పాఠశాల యాజమాన్యం చెబుతోంది. మృతుడి స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందినవాడుగా గుర్తించారు.

Tamil Nadu: బస్సు ఫుట్‌బోర్డ్‌పై నుంచి పడి తొమ్మిదో తరగతి బాలుడు మృతి

బాలుడి తల్లీదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు బాలుడిపై గాయాలున్నట్లు గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక ఇచ్చిన తర్వాత నిజంగానే టీచర్ కొట్టడం వల్లే బాలుడు చనిపోయాడా? లేదా బెడ్ పైనుంచి కింద పడిపోవడంతోనే బాలుడు చనిపోయాడా అనేది తెలియనుంది.

బాలుడి మృతిపై పోలీసులు 174 సస్పెక్టెడ్ డెత్ కింద కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ఉపాధ్యాయుల స్టేట్ మెంట్ తోపాటు అక్కడున్న విద్యార్థుల స్టేట్ మెంట్ ను కూడా నమోదు చేసుకున్నారు. విద్యార్థులైతే ఉపాధ్యాయుడు వేధించేవాడని చెబుతున్నారు. కానీ ఉపాధ్యాయులు మాత్రం బాలుడు బెడ్ పైనుంచి కింద పడిపోవడంతోనే చనిపోయాడని అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.