Global Investors Summit 2023: విజయవంతమైన గ్లోబల్ ఇన్వెస్ట్‭మెంట్ సమ్మిట్.. ఏపీకి వెల్లువెత్తిన పెట్టుబడులు

3.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 41 ప్రతిపాదనలను పరిశ్రమలు, వాణిజ్యం శాఖ ఆకర్షించింది. వీటి వల్ల 1.79 లక్షల మందికి ఉపాధి లభిస్తుందట. ఐటీ శాఖ 64,815 మందికి ఉపాధిని కల్పించే ఉద్దేశంతో 32,944 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. రాష్ట్రంలోని 13,400 మందికి ఉపాధి కల్పించేందుకు 8,718 కోట్ల రూపాయట పెట్టుబడితో పర్యాటక శాఖ 10 ప్రతిపాదనలపై సంతకాలు చేసింది.

Global Investors Summit 2023: విజయవంతమైన గ్లోబల్ ఇన్వెస్ట్‭మెంట్ సమ్మిట్.. ఏపీకి వెల్లువెత్తిన పెట్టుబడులు

Global Investment Summit 2023: AP recieve huge investments

Global Investment Summit 2023: విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు రోజుల పాటు నిర్వహించిన ‘‘ఇన్వెస్ట్‭మెంట్ సమ్మిట్-2023’’ విజయవంతం కావడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ సమ్మిట్ ద్వారా పలు కంపెనీల నుంచి రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టబడులు వచ్చాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‭మోహన్ రెడ్డి ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలోని యువతకు 6 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. అయితే ఇవే కాకుండా బుధవారం మరికొన్ని ఒప్పందాలు జరగనున్నట్లు వెల్లడించారు.

Komatireddy Rajagopal Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మొదటిరోజు 11,87,756 లక్షల కోట్ల రూపాయల విలువైన 92 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. అనంతరం రెండో రోజు సైతం 1.17 లక్షల కోట్ల రూపాయల విలువైన 260 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో 352 అవగాహన ఒప్పందాల ద్వారా 13,05,663 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రభుత్వం స్వీకరించింది. ఇంధన శాఖ 8.25 లక్షల కోట్ల పెట్టుబడితో 35 పెట్టుబడి ప్రతిపాదనలను ఆకర్షించింది. దీని వల్ల 1.33 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనా వేస్తోంది. రిలయన్స్ 1,00,000 మందికి ఉపాధిని కల్పించేలా 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ 2,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఒక్క ఎన్‭టీపీసీ వల్లే 77,000 మందికి ఉపాధి కల్పించనున్నట్టు వెల్లడించింది.

ఇక జేఎస్‭డబ్లూ గ్రూప్ 6 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. 50,632 కోట్ల రూపాయల పెట్టుబడితో 9,500 మందికి ఉపాధిని కల్పిస్తామంటోంది. ఏబీసీ లిమిటెడ్ 1.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక ఎంవోయూ మీద సంతకం చేసింది. దీని ద్వారా 7,000 మందికి ఉపాధిని కల్పిస్తామంటోంది. అరబిందో గ్రూప్ 10,365 కోట్ల రూపాయల పెట్టుబడితో 5 అవగాహన ఒప్పందాలపై సంతకం చేయగా 5,250 మందికి ఉపాధి లభించనుందని అంచనా. ఇక అదానీ గ్రీన్ ఎనర్జీ 21,820 కోట్ల రూపాయల పెట్టుబడితో 14,000 మందికి ఉపాధి కల్పించేందుకు 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్ 9,300 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. దీని ద్వారా 2,850 మందికి ఉపాధి కల్పిస్తామంటోంది. జిందాల్ స్టీల్ 2,500 మందికి ఉపాధి కల్పించే ,500 కోట్ల పెట్టుబడితో ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

3.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 41 ప్రతిపాదనలను పరిశ్రమలు, వాణిజ్యం శాఖ ఆకర్షించింది. వీటి వల్ల 1.79 లక్షల మందికి ఉపాధి లభిస్తుందట. ఐటీ శాఖ 64,815 మందికి ఉపాధిని కల్పించే ఉద్దేశంతో 32,944 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. రాష్ట్రంలోని 13,400 మందికి ఉపాధి కల్పించేందుకు 8,718 కోట్ల రూపాయట పెట్టుబడితో పర్యాటక శాఖ 10 ప్రతిపాదనలపై సంతకాలు చేసింది. ఇవే కాకుండా ఎండానా ఎనర్జీస్‌, అబ్సింకా హోటల్స్, సర్‌రే విలేజ్‌ రిసార్ట్స్‌, హ్యాపీ వండర్‌లాండ్‌ రిసార్ట్స్‌, ఛాంపియన్స్‌ యాచ్‌ క్లబ్ వంటి సంస్థలతో తక్కువ పెట్టుబడులతో మరిన్ని ఒప్పందాలు జరిగాయి.

సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: సిఎం జగన్

పెట్టుబడులకు ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తలిపారు. అలాగే సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. గత మూడేళ్లలో ఏపి ఆర్ధికంగా ముందడుగు వేస్తోందని, ఏపిని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని ఆయన అన్నారు. ‘‘పారదర్శక పాలనతో రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తున్నాం. 15 కీలక రంగాల్లో పెట్టుబడులు రావడం అభినందనీయం. చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నాం. రెండురోజుల సదస్సులో 352 ఎంవోయూలు కుదిరాయి. త్వరితగతిన పరిశ్రమల స్ధాపనకు ముందుకురావాలి. గ్రీన్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం’’ అని సీఎం జగన్ అన్నారు.

Romancham : మరోసారి హాట్ టాపిక్ గా మలయాళ సినిమా.. 2 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా..

ఈ సమ్మిట్ విజయం సాధించడంపై మంత్రుల స్పందన..
‘‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, కేంద్ర మంత్రులు ఈ సమ్మిట్‭లో పాల్గొన్నారు. ఈ రోజు 352 ఎంవోయూలు జరిగాయి. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించడానికి మంచి ప్రయత్నం. ఎన్నడు చూడని విధంగా ఈ సమ్మిట్ నిర్వహించాం. ప్రముఖ పారిశ్రామికవేత్తలు పుర్తి సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. 20 సెక్టార్లలో పెట్టుబడులను ఆకర్షించాం.
100 మంది వ్యక్తలు సమ్మిట్‭లో ప్రసంగించారు’’ – మంత్రి గుడివాడ అమర్‭నాథ్

‘‘గ్లోబెల్ ఇన్వెస్ట్‭మెంట్ సమ్మీట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిశ్రమలు వచ్చాయి. దీనితో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చే మత్స్య, పశు సంవర్దక శాఖలకు ఎంఓయుల ద్వారా వచ్చే పరిశ్రమల ద్వారా మరింత ఆదాయం వస్తుంది. సమ్మీట్ ద్వారా వచ్చే పరిశ్రమలు పెరిగి, ఉద్యోగ ఉపాధి పెరిగి రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుంది. 40 దేశాల నుండి సుమారు 600 ప్రతినిధులు వర్చువల్ గా సమ్మిట్ లో పాల్గొన్నారు. పెద్దమొత్తంలో వచ్చిన పెట్టుబడులను వాస్తవికత రూపంలో తీసుకురానున్నాం. పెట్టుబడులపై వాస్తవికత రూపంలో తీసుకురావడానికి ఒక కమీటిని వేశాం. పర్యావరణం పరిరక్షస్తూ,రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వెలుతున్నాం’’ – మంత్రి సిదిరి అప్పల రాజు

‘‘అన్ని ఎంఓయులు గ్రౌండనింగ్ అవుతాయి. టీడీపీ ప్రభుత్వం లాగా కాకుండా ఏవైతే గ్రౌండ్ అయ్యే అవకాశం వుందో ఆ కంపెనీలతోనే ఎంఓయు చేసుకున్నాం. సమ్మిట్ చూసి టీడీపీ ఏడుస్తోంది. దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్తలు ఎంఓయు చేసుకున్నారు. సమ్మీట్ విజయవంతం అయ్యింది’’ – మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

Ippatam Demolition: ఇప్పటంలో ఉద్రిక్తత.. మళ్లీ మొదలైన కూల్చివేతలు.. అడ్డుకున్న గ్రామస్తులు.. భారీగా పోలీసుల మోహరింపు

“విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహణ సంతోషదాయకం. దేశంలోనే విశాఖ ప్రత్యేక నగరం. ఏపి అభివృద్ధికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. సాగరమాల పథకం కింద ఏపికి ప్రాధాన్యత ఇచ్చాం. మేజర్ పోర్టులు, నాన్ మేజర్ పోర్టుల కింద ఆర్ధిక సాయం అందిస్తున్నాం. ఏపిలో పోర్టుల అభివృద్ధికి దేశం నుంచి అన్ని సహాయసహకారాలు అందాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ముందడుగు వేస్తోంది. పోర్టుల అభివృద్ధికి కేంద్రం కేటాయిస్తున్న నిధులు మరింతగా పెరిగాయి’’ – కేంద్రమంత్రి శర్బానంద్ సోనోవాల్