Romancham : మరోసారి హాట్ టాపిక్ గా మలయాళ సినిమా.. 2 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా..

ఇటీవల రెగ్యులర్ గా ఏదో సినిమా విషయంలో హాట్ టాపిక్ గా మారుతుంటుంది మాలీవుడ్ ఇండస్ట్రీ. డిఫరెంట్ పాయింట్స్ తో సినిమాలు తీసి హిట్ కొడుతుంది మలయాళ ఇండస్ట్రీ. లాస్ట్ ఇయర్ చాలా సినిమాలు ది బెస్ట్ అనిపించుకోగా ఈ ఏడాది కూడా అందరూ డిస్కస్ చేసుకొనే రేంజ్ సినిమాలొచ్చాయి. రీసెంట్ గా....................

Romancham : మరోసారి హాట్ టాపిక్ గా మలయాళ సినిమా.. 2 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా..

Malayalam Romancham movie collects 50 crores with only 2 crores budget

Romancham :  ఒకప్పుడు మలయాళ సినిమాలంటే పెద్దగా ఎవరికీ తెలీదు, తెలిసినా చాలా మందికి చిన్నచూపు ఉండేది. కానీ అది గతం. గత నాలుగేళ్లుగా ఎక్కడ చూసినా మలయాళ సినిమానే హాట్ టాపిక్ గా ఉంటుంది. మలయాళంలో చిన్న చిన్న సినిమాలుగా రిలీజయి భారీ హిట్ కొట్టి అన్ని పరిశ్రమలలో వాటి గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. అంతేకాక వేరే సినీ పరిశ్రమల వాళ్ళు ఆ సినిమాల రీమేక్ రైట్స్ తీసుకొని మలయాళ సినిమాలని వేరే భాషల్లో రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవల రెగ్యులర్ గా ఏదో సినిమా విషయంలో హాట్ టాపిక్ గా మారుతుంటుంది మాలీవుడ్ ఇండస్ట్రీ. డిఫరెంట్ పాయింట్స్ తో సినిమాలు తీసి హిట్ కొడుతుంది మలయాళ ఇండస్ట్రీ. లాస్ట్ ఇయర్ చాలా సినిమాలు ది బెస్ట్ అనిపించుకోగా ఈ ఏడాది కూడా అందరూ డిస్కస్ చేసుకొనే రేంజ్ సినిమాలొచ్చాయి.  మమ్ముట్టి హీరోగా నటించిన ‘నన్ పగల్ నేరత్తు మయక్కం’, బిజు మీనన్ , వినీత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రల్లో ‘తంగం’, వినీత్ శ్రీనివాసన్ మెయిన్ లీడ్ లో ‘ముకుందన్ ఉన్నీ అసోసియేట్స్’ లాంటి సినిమాలు థియేటర్స్ లోనూ, ఓటీటీలోనూ దుమ్ము రేపేశాయి. ఇక లేటెస్ట్ గా మరో చిన్న సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. కేవలం 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి ఇంకా ఫుల్ రన్ పూర్తి కాకుండానే అప్పుడే 50 కోట్లు వచ్చిపడ్డాయి. ఆ సినిమా పేరు ‘రోమాంచం’.

Nikhil Siddhartha : సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పాసులు ఫ్రీగా కావాలా? ఫ్యాన్స్ కి సూపర్ ఆఫర్ ఇచ్చిన నిఖిల్.. కానీ ఈ పని చెయ్యాలి..

సౌబిన్ షాహిర్ అనే కమెడియన్, నటుడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రోమాంచం’. పెట్టిన బడ్జెట్ కు, వస్తున్న కలెక్షన్స్ కు ఎక్కడా పొంతన కుదురకపోవడంతో ఈ సినిమా గురించి నేషనల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. రోమాంచం సినిమాకి జీతు మాధవన్ డైరెక్టర్. ఈ సినిమా ఫిబ్రవరి 3న మలయాళంలో రిలీజయింది. ఏడుగురు బ్రహ్మచారులు బోర్ కొడుతోందనే ఉద్దేశంతో సరదాగా ఔజా గేమ్ ఆడతారు. అంటే ఓ బోర్డు మీద ఇంగ్లీష్ అక్షరాలు నెంబర్లు ఉపయోగించి ప్రేతాత్మలతో మాట్లాడ్డం. ఏదో టైం పాస్ కోసం మొదలుపెడితే ఇది కాస్తా అనూహ్య సంఘటనలకు దారి తీస్తుంది. అక్కడి నుంచి వచ్చే కామెడీ సీన్స్ వేరే లెవెల్. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం అన్ని భాషల్లోనూ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తెలుగు నుంచి కూడా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారట. మరి ఈ సినిమా ఇంకెంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాతో మరోసారి మలయాళ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.