Devendra Fadnavis: బిల్కిస్ బానో అత్యాచార నేరస్తులను సన్మానించడాన్ని తప్పు పట్టిన ఫడ్నవీస్

‘‘20 ఏల్ల తర్వాత నిందితులు విడుదల అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వారు విడుదల అయ్యారు. అయితే అతడు పూర్తిగా నిర్దోషి అని రుజువు కానంతవరకు నిందితుడు నిందితుడిగానే ఉంటాడు. నిందితులకు సన్మానాలు చేయడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. బిల్కిస్ బానో అత్యాచార నిందితుల విషయంలో జరిగింది కూడా సమర్ధనీయం కాదు’’ అని ఫడ్నవీస్ అన్నారు.

Devendra Fadnavis: గుజరాత్‭లోని గోద్రాలో 2002 నాటి అల్లర్లలో బిల్సిస్ బానో అనే ముస్లిం మహిళపై సామూహిక అత్యాచారం చేసిన 11 మందిని కోర్టు తాజాగా విడుదల చేసింది. అయితే వారు విడుదల కాగానే భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నేత సన్మానం చేశారు. మరొక వ్యక్తి వారికి స్వీట్లు పంచుతూ, వారి పాదాలను తాకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో.. నేరస్థులకు ఈ మర్యాదలేంటని, అసలు వారిని ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందంటూ అనేక విమర్శలు వస్తున్నాయి.

కాగా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఈ విషయమై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదేని నేరంలో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సన్మానం లాంటివి చేయడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని అన్నారు. భండారా జిల్లాలో 35 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచారంపై మంగళవారం మహారాష్ట్ర శాసన మండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంలో బిల్కిస్ బానో సామూహిక అత్యాచార అంశం చర్చకు వచ్చింది.

దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ ‘‘20 ఏల్ల తర్వాత నిందితులు విడుదల అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వారు విడుదల అయ్యారు. అయితే అతడు పూర్తిగా నిర్దోషి అని రుజువు కానంతవరకు నిందితుడు నిందితుడిగానే ఉంటాడు. నిందితులకు సన్మానాలు చేయడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. బిల్కిస్ బానో అత్యాచార నిందితుల విషయంలో జరిగింది కూడా సమర్ధనీయం కాదు’’ అని ఫడ్నవీస్ అన్నారు.

Bihar: గుడిలోకి వెళ్లిన ముస్లిం మంత్రి.. సీఎంపై బీజేపీ ఆగ్రహం

ట్రెండింగ్ వార్తలు