WWE : Undertaker రిటైర్ మెంట్!

  • Publish Date - June 22, 2020 / 07:46 AM IST

WWE ఫైట్స్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది..ఆజానుబాహుడు అండర్ టేకర్. అతను చేసే ఫైట్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. రింగ్ లోకి రాగానే అండర్ టేకర్ చేసే విన్యాసాలు, హావభావాలకు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతుంటారు.

గత కొద్ది రోజులుగా ఆయన ఫైట్స్ చేస్తున్నారు. కానీ..ఇక ఆయన ఫైట్స్ చూడలేమని సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే రిటైర్ మెంట్ ప్రకటించారని సమాచారం. తన డ్యాక్యుమెంటరీ సిరీస్ Undertaker: The Last Ride లో ఈ అంశాన్ని వెల్లడించారంట.

రింగ్ లోకి వెళ్లడానికి కోరిక లేదని వెల్లడించారు. ఆట మారిపోయిందని, కొత్త కుర్రాళ్లు రావడానికి సమయం ఆసన్నమైందన్నారు. రెసిల్ మేనియా 36లో AJ Stylesతో తలపడనున్నారు అండర్ టేకర్. ఇదే చివరి మ్యాచ్ అంటున్నారు. కానీ కరోన వైరస్ కారణంగా…మ్యాచ్ సందిగ్ధంలో పడింది.

ప్రపంచ వ్యాప్తంగా wweలో ఒక సుస్థిరమైన స్థాపం సంపాదించాడు. వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ ను మూడు సార్లు, wwf / wwe ఛాంపియన్ షిప్ 4 సార్లు, wwf Hardcore Championship ఒకసారి, WWF World Tag Team Championship ఆరు సార్లు, 2007లో Royal Rumble గెలుచుకున్నాడు అండర్ టేకర్. 

Read: హార్దిక్ పాండ్యా పోస్టుకు నోరెళ్లబెట్టిన బాలీవుడ్ నటులు