ఎన్నికలు సమీపిస్తున్నవేళ డైరీ లీక్స్ ఇప్పుడు దేశంలో కలకం సృష్టిస్తున్నాయి. బీజేపీని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్‌కు సరికొత్త అస్త్రం అందివచ్చింది.2009లో కర్ణాటక సీఎంగా ఉన్న సమయంలో యడ్యూరప్ప నుంచి బీజేపీ అగ్రనేతలకు రూ.1800 కోట్ల ముడుపులు అందాయని ది కారవాన్ మాగజైన్ యడ్డీ డైరీస్ పేరుతో ప్రచురించిన ఓ కథనాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధికారప్రతినిధి రణదీప్ సుర్జేవాలా బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Also : చెన్నైలో కలకలం : శ్రీరెడ్డిపై తమిళ నిర్మాత దాడి
కారవాన్ రిపోర్ట్ ప్రకారం…బీజేపీ కేంద్రకమిటీకి రూ.1000కోట్లు,అరుణ్ జైట్లీకి రూ.150కోట్లు,నితిన్ గడ్కరీకి రూ.150కోట్లు,రాజ్ నాథ్ సింగ్ కు రూ.100కోట్లు,ఎల్ కే అద్వానీకి రూ.50కోట్లు,మురళీ మనోహర్ జోషికి రూ.50కోట్లు,మరికొందరు బీజేపీ నేతలకు, పెద్దసంఖ్యలో న్యాయమూర్తులు, అడ్వకేట్లకు డబ్బు ఇచ్చినట్టు యడ్యూరప్ప తన డైరీల్లో రాసుకున్నారని ఈ కథనం వెల్లడించడం కలకలం రేపింది.అంతేకాకుండా గడ్కరీ కుమారుడి పెళ్లికి యడ్యూరప్ప రూ.10కోట్లు చెల్లించినట్లు ఆ డైరీలో ఉన్నట్లు తెలిపింది.యడ్యూరప్ప సంతకంతో ఉన్న ఈ డైరీ 2017 నుంచి ఆదాయ పన్ను అధికారుల దగ్గర ఉన్నప్పటికీ దీనిపై లోతైన విచారణ ఎందుకు చేపట్టలేదని సుర్జేవాలా ప్రశ్నించారు. ఈ వార్తా కథనంపై బీజేపీ నేతలు స్పందించాలని సుర్జీవాలా డిమాండ్ చేశారు.ఈ కథనం వాస్తవమా..కాదా అనేది బీజేపీ తక్షణమే వివరణ ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన యడ్యూరప్ప..లోక్ సభ ఎన్నికల్లో ఓట్లకోసమే కాంగ్రెస్ పార్టీ మీడియాలో ఓ కట్టుకథ అల్లిందని ఆరోపించారు.కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలు పూర్తి అవాస్తవమని అన్నారు.మోడీ పాపులారిటీ పెరిగిపోతుండటంతో చూసి కాంగ్రెస్ నేతలు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని అన్నారు.డాక్యుమెంట్లు అన్నీ సృష్టించినవీ,ఫేక్ అని ఐటీ అధికారులు ఇప్పటికే ఫ్రూవ్ చేశారని అన్నారు.తనపై అసత్య ఆరోపణలు చేసిన సంబంధిత వ్యక్తిపై పరువునష్టం దావా వేసేందుకు అడ్వకేట్లతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
Read Also : మిస్టరీ : బీచ్‌లో నరికిన మనిషి కాళ్లు కొట్టుకొస్తున్నాయ్
Our website is up and running again.
Subscribe now to read @nileenams and @aathira_vk‘s report on the Yeddy Diaries: Pages with IT dept note that #Yeddyurappa paid Rs 1,800 crore to BJP and its leaders, and judges and advocates. https://t.co/BVlNGt8bRq pic.twitter.com/P4IRlL7P57
— The Caravan (@thecaravanindia) 22 March 2019
Randeep Surjewala,Congress: Is it true or false? The diary with BS Yeddyurappa’s sign on it was with the Income Tax Department since 2017. If that is the case why did Modi ji and BJP did not get it investigated? https://t.co/mzQV53tp00
— ANI (@ANI) 22 March 2019