Ramdev Vs Doctors : సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాందేవ్ బాబా

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసుల విచారణనను నిలిపివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

Ramdev Vs Doctors : ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసుల విచారణనను నిలిపివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కోవిడ్ చికిత్సలో అల్లోపతి సమర్థతపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అత్యున్నత న్యాయస్థానం తలుపులు తట్టారు. వీటిని కొట్టివేసేలా చూడాలని కోరారు.

అలోపతి, డాక్టర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాందేవ్ బాబా. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహా పలు వైద్య సంఘాలు ఖండిచాయి. అంతేగాకుండా..వివిధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. అలోపతిని స్టుపిడ్ మెడిసన్ అని, కొంతమంది కోవిడ్ రోగులు చనిపోయారని..ఆయన మొదట వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరూ అరెస్టు చేయలేరని… అసలు తాను మెడికల్ మాఫియా గురించి ప్రస్తావించానే తప్ప డాక్టర్లను కించపరచలేదని తెలిపారు.

. ఇందుకు తాను క్షమాపణలు కూడా చెప్పడం జరిగిందన్నారు రాందేదవ్ బాబా. ఈ విషయంలో ఉత్తరాఖండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. మరి బాబా రాందేవ్ బాబా విషయంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు