Yogi
Yogi On Akhilesh Jinnah Remark సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను… మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌లతో పోల్చిన అఖిలేష్ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఉత్తరప్రదేశ్ సీఎం.. దీనిని ‘తాలిబనీ మైండ్‌సెట్’గా అభివర్ణించారు. జిన్నాను ‘భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి’గా కీర్తిస్తూ చేసిన వ్యాఖ్యలకు అఖిలేష్ క్షమాపణలు చెప్పాలని యోగి డిమాండ్ చేశారు.
సోమవారం ఓ కార్యక్రమంలో ప యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ…సమాజ్‌వాదీ పార్టీ అధినేత నిన్న జిన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చారు. ఇది సిగ్గుచేటు. నిన్న పటేల్‌తో పోల్చుతూ జిన్నాను కీర్తించాలని ప్రయత్నించినప్పుడు అతని(అఖిలేష్) విభజన మనస్తత్వం మరోసారి బయటపడింది. ఉత్తర ప్రదేశ్ మరియు భారతదేశ ప్రజలు ఈ విభజన మనస్తత్వాన్ని ఎన్నటికీ అంగీకరించరని నేను భావిస్తున్నాను. ఇది తాలిబానీ మైండ్ పైట్. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ సాధనకు కృషి జరుగుతోందని యోగి తెలిపారు..
కాగా, ఆదివారం ఓ కార్యక్రమంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ…సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ మరియు జిన్నా ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో చదివి బారిస్టర్ అయ్యారు. వారు ఒకేచోట చదువుకున్నారు. వారు బారిస్టర్‌లు అయ్యారు. వారు భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. వారు ఎలాంటి పోరాటంలో పాల్గొనడం మానుకోలేదు అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అఖిలేష్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
ALSO READ Akhilesh Yadav : పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నాపై అఖిలేశ్ యాదవ్ పొగడ్తలు