Uttarakhand Chief Minister's
Birth To 2… Why Not 20 ?” : ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ మరోసారి నోరు పారేసుకున్నారు. వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు. మొన్నటికి మొన్న..మహిళల వస్త్రధారణపై నోరుజారి కామెంట్స్ చేసి..వెనక్కి తగ్గిన తీరత్ సింగ్…పిల్లలను కే విషయంలో వివాదాస్పద కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న రేషన్ ఎక్కువగా పోందాలని అనుకుంటే…ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ఉచిత సలహా ఇచ్చారాయన. ఒక్కో వ్యక్తికి నెలకు ఐదు కిలోల బియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు.
ఓ కుటుంబంలో 10 మంది ఉంటే..50 కేజీలు అందుతాయని, అదే..20 మంది కుటుంబసభ్యులుంటే..100 కిలోలు బియ్యం వస్తాయన్నారు. ఇద్దరు కుటుంబసభ్యులున్న వారు దీనిని ఓర్చుకోలేకపోతున్నారని..20 మందిని ఎందుకు కనలేదంటూ ప్రశ్నించడం వివాదాస్పదమైంది. ఒక బాధ్యతయుతమైన స్థానం.అదీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంతేగాకుండా…అమెరికా మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిందంటూ నాలిక కరుచుకున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టి కొద్ది రోజుల కాకముందే..మహిళల వస్త్ర ధారణపై కామెంట్స్ చేయడంపై మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు చిరిగిన జీన్స్ ధరిస్తున్నారని..సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ నోరు పారేసుకోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. తాజాగా చేసిన కామెంట్స్ పై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి మరి.