Madhya Pradesh: భారత ఆధ్యాత్మికతలో సామాజిక ఆవశ్యతకు కృషి చేసిన సంత్ రవిదాస్ ఉత్తరభారతంలో చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా ఆయన కుల అసమానత్వం, లింగ అసమానత్వంపై నిర్విరామ పోరాటం చేశారు. ఈ అంశాలపై కవిగా ఆయన చేసిన రచనలు నేటికీ భారతదేశం అంతటా వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన రాసిన భక్తి పద్యాలు అయిన గురు గ్రంథ్ సాహిబ్ అని పిలువబడే సిక్కు గ్రంథాలలో చేర్చబడ్డాయి. హిందూమతంలోని దాదు పంతి సంప్రదాయానికి చెందిన పంచ వాణి వచనంలో కూడా రవిదాస్ అనేక పద్యాలు ఉన్నాయి. రవిదాస్సియా అనే మత ఉద్యమంలో ఆయన ప్రధాన వ్యక్తి.
Pakistan Politics: పాకిస్తాన్ కొత్త ప్రధానిగా అన్వర్ ఉల్ హక్.. అంగీకరించిన ప్రధాని, విపక్షాలు
కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో మహా సంత్ రవిదాస్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సంత రవిదాస్ మార్గాన్ని అనుసరించాలని సూచించారు. సాగర్‌కు ఆనుకుని ఉన్న బడ్తుమా, మక్రోనియాలో ఈ ఆలయం నిర్మించబోతున్నారు. మరి ఆ ఆలయ విషయాలు ఏంటో తెలుసుకుందాం.
100 కోట్లతో ఆలయాన్ని నిర్మించనున్నారు
బడ్తుమలో నిర్మించే ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 11.29 ఎకరాల స్థలంలో ఆలయంతో పాటు ఆర్ట్ మ్యూజియం నిర్మించనున్నారు. ఈ ఆలయం నగారా శైలిలో నిర్మించబడుతుంది. ఇందులో సంత్ రవిదాస్ జీవిత చరిత్రను మ్యూజియంలో ప్రత్యేక శైలిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియం 20,500 చదరపు అడుగులలో ఉంటుంది. ఇందులో నాలుగు గ్యాలరీలు ఉంటాయి. సంత్ రవిదాస్ జీవితం మొదటి గ్యాలరీలో ఏర్పాటు చేయనున్నారు.
రెండవ గ్యాలరీలో, ఆయన సందేశం, భక్తి మార్గం, నిర్గుణ ఆరాధన గురించి చెప్పనున్నారు. మూడవ గ్యాలరీ సంత్ రవిదాస్, రవిదాస్సియా కల్ట్ ప్రభావాలపై ఏర్పాటు చేస్తున్నారు. నాల్గవ గ్యాలరీలో సంత్ రవిదాస్ సాహిత్యం, సమకాలీన వర్ణన చెప్పబడుతుంది. అంతే కాకుండా ఆలయంలో సంబంధిత మందిరాన్ని కూడా నిర్మించనున్నారు. ఇందులో ప్రజలు కీర్తనలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఆలయంలో గ్రంథాలయాన్ని నిర్మిస్తామన్నారు
దీంతో పాటు ఆలయ ప్రాంగణంలో భారీ గ్రంథాలయాన్ని కూడా నిర్మించనున్నారు. ఇందులో సంత్ రవిదాస్‌కు సంబంధించిన అన్ని సాహిత్యాలు, ఆయన జీవితం ఆధారంగా వచ్చిన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. అదే సమయంలో ఆలయంలో సింబాలిక్ వాటర్ ట్యాంక్‌ను కూడా నిర్మించనున్నారు. ఆలయానికి వచ్చే ప్రజలు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక్కడ ప్రజలు బస చేసేందుకు 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భక్త నివాసం నిర్మించనున్నారు. ఇందులో 15 ఏసీ గదులు ఉంటాయి. ఒక్కో గదిలో దాదాపు 80 మంది ఉండగలరు. దీంతోపాటు ఫుడ్‌కోర్టును ఏర్పాటు చేసి, దాని ద్వారా ప్రజలకు భోజన ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయం మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. మొత్తం ఆలయంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా అగ్నిమాపక భద్రత, లైటింగ్ తదితర అన్ని ఏర్పాట్లూ ఉంటాయని, ఆలయాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు వీలుగా ఉండనుంది.
తామర పువ్వుపై సంత్ రవిదాస్
ముందుగా పార్కు నిర్మిస్తారు. అనంతరం ఈ పార్కు మధ్యలో శిఖర్నుమ దేవాలయం ఉంటుంది. ఇందులో సంత్ రవిదాస్ తామర పువ్వుపై కూర్చుని ఉండే ప్రతిమను తీర్చిదిద్దుతారు. ఇది కాకుండా కాశీ నుంచి దేశం మొత్తానికి సాగిన సంత్ రవిదాస్ ప్రయాణం ఈ ఆలయంలో చూపబడుతుంది. సాధువుల జీవితానికి సంబంధించిన వివిధ మాధ్యమాలు కూడా ఆలయంలో ప్రదర్శించనున్నారు.