Priyanka Gandhi Vadra: సోనియా, రాహుల్ తర్వాత ఇప్పుడు ప్రియాంక వంతు.. ఇంతకీ రాబర్ట్ వాద్రా ఏం చెప్పారు?
ప్రియాంక గాంధీకి పార్టీలో అధికారిక గుర్తింపునిచ్చారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించారు. అంతే కాకుండా.. 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలు పూర్తిగా తన మీద వేసుకుని పని చేశారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు.. నిజానికి రాబర్ట్ వాద్రా ఈ మాట ఊరికే అనరు. కాంగ్రెస్ పార్టీలో దీనిపై ఒక సానుకూలత వచ్చాకే ఆయన ఇలా వ్యాఖ్యానించారని అంటున్నారు.

Robert Vadra: కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా కాలంగా పార్లమెంటు సభ్యులుగా పని చేస్తున్నారు. వారసత్వంగా స్వీకరించిన రాజకీయాల్లో తమదైన ముద్రవేస్తూ చాలా ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్నారు. అయితే గాంధీ కుటుంబానికి చెందిన మరో కీలక వ్యక్తి అయిన ప్రియాంక గాంధీ వాద్రా మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది కాలం క్రితం వరకు ఆమె రాజకీయాలకే దూరం ఉన్నారు. కేవలం సోనియా, రాహుల్ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేసేవారు. కానీ గత సార్వత్రిక ఎన్నికలకు(2019 ఎన్నికలు) ముందు నుంచి ఆమె ప్రధాన రాజకీయాల్లోకి వచ్చేశారు.
సోదరుడు రాహుల్ గాంధీకి పోటీగా ప్రచారం నిర్వహించారు. ఇక అదే సమయంలో ఆమెకు పార్టీలో కూడా అధికారిక గుర్తింపునిచ్చారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించారు. అంతే కాకుండా.. 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలు పూర్తిగా తన మీద వేసుకుని పని చేశారు. అయినప్పటికీ ప్రియాంక ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ప్రభుత్వ అధికారిక పదవులకు దూరంగానే ఉన్నారు. ప్రియాంక ఎప్పుడు పోటీ చేస్తారనే ప్రశ్న చాలా కాలంగానే ఉన్నప్పటికీ.. ఆమె పార్టీలో అధికారికంగా పదవి చేపట్టిన నాటి నుంచి కాస్త ఎక్కువగానే వినిపిస్తోంది.
Manipur Violence: మణిపూర్లో సర్జికల్ దాడులు.. బీజేపీ మిత్రపార్టీ నేత సంచలన వ్యాఖ్యలు
అయితే ఈ ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికినట్లే కనిపిస్తోంది. అలాగే ఎన్నికల్లో ప్రియాంక పోటీపై ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోన్న పార్టీ శ్రేణులకు తీపి కబురే లభించిందనిపిస్తోంది. ప్రియాంకను పార్లమెంటుకు పంపించాలని, అందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆమె భర్త రాబర్ట్ వాద్రా తాజాగా అన్నారు. ఆమె చాలా చక్కగా పని చేస్తుందని, ఎంతో అంకితభావం కలిగిన నాయకురాలని ఆయన కీర్తించారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు.. నిజానికి రాబర్ట్ వాద్రా ఈ మాట ఊరికే అనరు. కాంగ్రెస్ పార్టీలో దీనిపై ఒక సానుకూలత వచ్చాకే ఆయన ఇలా వ్యాఖ్యానించారని అంటున్నారు.
Pakistan Politics: పాకిస్తాన్ కొత్త ప్రధానిగా అన్వర్ ఉల్ హక్.. అంగీకరించిన ప్రధాని, విపక్షాలు
తొందరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే చర్చ కూడా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన అమేథీ నుంచి పోటీ చేయొచ్చని అంటున్నారు. గతంలో రాహుల్ గాంధీకి స్థానిక నియోజకవర్గంగా ఉన్న అమేథీని ఆయన వదిలేసి కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన అక్కడి నుంచే పోటీ చేయనున్నారు. దీంతో అమేథీని ప్రియాంక తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది.