Bengaluru
Bengaluru : బెంగళూరులో వింత దొంగతనం జరిగింది. రూ.10 లక్షలతో పాక్షికంగా నిర్మించిన బస్ షెల్టర్ రాత్రిపూట అదృశ్యం అయ్యింది. అది దొంగల పని అని తెలిసిన స్ధానికులు షాకయ్యారు.
బెంగళూరు ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా దొంగలు బస్ షెల్టర్‌ను ఎత్తుకెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కన్నీంహామ్ రోడ్‌లో పాక్షికంగా బస్ షెల్టర్‌ను నిర్మించారు. రూ.10 లక్షల ఖర్చుతో కుర్చీలు, పైకప్పులు, స్తంభాలతో కూడిన స్టెయిన్ లెస్ స్టీల్ నిర్మాణాలను ఏర్పాటు చేసారు. వీటిని దొంగలు దోచుకెళ్లారు. బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (BMTC) నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది.
Money Plant : మనీ ప్లాంట్ దొంగతనం చేసి ఇంట్లో నాటితే నిజంగా అదృష్టం కలిసి వస్తుందా?
ఈ ఘటనపై బీఎంటీసీ వైస్ ప్రెసిడెంట్ ఎన్.రవిరెడ్డి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దొంగతనానికి గురైన బస్ షెల్టర్ స్ధానంలో మరో షెల్టర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సర్జాపూర్‌లో 27 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను మోసం చేసి కేటుగాళ్లు రూ.60 లక్షలు కాజేసారు. నకిలీ పార్ట్ టైమ్ ఉద్యోగం పేరుతో కొందరు మోసగాళ్లు చెప్పిన మాటలు నమ్మి తను రూ.10 లక్షలు కట్టడమే కాకుండా ఆమె మరికొందరితో కట్టించింది. అలా రూ.60 లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు పరారయ్యారు.
? Bus stop at Cunningham road, Bengaluru city worth 10 lakhs goes missing overnight. pic.twitter.com/DBV3DVVusc
— Indian Tech & Infra (@IndianTechGuide) October 8, 2023