Karnataka Dam
Karnataka : ఓ 20 ఏళ్ల యువకుడు అత్యంత సాహాసకృత్యం చేయటానికి పూనుకున్నాడు. సినిమాల ప్రభావమో… అతి విశ్వాసమో తెలియదు కానీ డ్యామ్ గోడ ఎక్కుతుండగా పొరపాటున కాలు జారి కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లాలోని శ్రీనివాస సాగర్ డ్యాం నిండుకుండలా ఉంది. నీరు పైనుంచి కిందకు జారుతోంది. అయితే అక్కడకు సందర్శనకు వచ్చిన 20 ఏళ్ల యువకుడు ప్రాణాలకు తెగించి ఒక సాహాసం చేయటానికి ఒడిగట్టాడు. పైనుంచి నీళ్లు పడుతున్న డ్యాం గోడ ఎక్కటానికి ప్రయత్నించాడు.
ఆ డ్యాం గోడ ఎత్తు సుమారు 50 అడుగులు ఉంది. యువకుడు పైకి ఎక్కుతుంటే అక్కడ నిలబడిన వారంతా చూస్తూ ఉన్నారే తప్ప అతడ్ని వారించలేదు. పైనుంచి నీరు పడుతోంది. ఆ యువకుడు ఎక్కటానికి ప్రయత్నించాడు.
దాదాపు సగం దూరం ఎక్కాడు. నీటి ప్రవాహానికి పట్టు తప్పి అక్కడ నుంచి జారి కిందపడ్డాడు. అక్కడున్నవారు బాధితుడిని చికిత్స కోసం బెంగుళూరు ఆస్పత్రికి తరలించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవటంతో పోలీసుల యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.