Woman Swallows Phone (Photo : Google)
Woman Swallows Phone : తన సోదరుడితో గొడవపడిన ఓ యువతి మొబైల్ ఫోన్ మింగేసింది. ఏంటి షాక్ అయ్యారా? మొబైల్ ఫోన్ మింగడం ఏంటి? నమ్మబుద్ధి కావడం లేదు కదూ. అవును.. ఆ యువని ఫోన్ మింగేసింది. ఇది నిజమే. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింద్ లో చోటు చేసుకుంది.
అసలేం జరిగింది? ఆ వివరాల్లోకి వెళితే.. ఓ 18ఏళ్ల యువతి తన సోదరుడితో గొడవ పడింది. కోపంతో ఊగిపోయింది. ఆ కోపంలోనే కీ ప్యాడ్ ఉన్న మొబైల్ ఫోన్ ను మింగేసింది. అంతే, యువతి చర్యతో అంతా విస్తుపోయారు. ఇంతలో.. యువతికి వాంతులు మొదలయ్యాయి. తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు కంగారుపడిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Also Read..Viral Video : ద్యావుడా..! మెట్రో ట్రైన్‌లో బికినీలో యువతి, వీడియో వైరల్
డాక్టర్లు యువతికి టెస్టులు చేశారు. ఆమె కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించి నివ్వెరపోయారు. ఫోన్ మింగడటం ఏంటని విస్తుపోయారు. ఇక, యువతిని కాపాడాలంటే.. వెంటనే సర్జరీ స్టార్ట్ చేశారు. రెండు గంటల పాటు డాక్టర్లు శ్రమించి కడుపులో ఉన్న ఫోన్ ను బయటకు తీశారు. యువతి ప్రాణాలను కాపాడారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. గ్వాలియర్ లోని జైరోగ్య ఆసుపత్రి డాక్టర్లు యువతికి సర్జరీ చేశారు.(Woman Swallows Phone)
Also Read..Delhi : వెరైటీ కోసం పాకులాడి గన్‌తో కేక్ కట్ చేశాడు.. ఆ తరువాత పోలీసులకి చిక్కి…
యువతికి ప్రాణాపాయం లేదని, ఆమె సేఫ్ అని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఫోన్ మింగేయడంతో.. అమ్మాయికి ఏం జరుగుతుందోనని వాళ్లు కంగారుపడ్డారు. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందారు. చివరికి కథ సుఖాంతం కావడంతో రిలాక్స్ అయ్యారు.
కాగా, సోదరుడితో గొడవపడిన యువతి ఫోన్ ను మింగేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి అంతా విస్తుపోతున్నారు. ఇదెక్కడి చోద్యం అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ద్యావుడా.. అని తలపట్టుకున్నారు.