ఆయనది 56 అంగుళాల ఛాతీ.. నేనెలా కొట్టగలను?

  • Publish Date - May 11, 2019 / 04:04 PM IST

ప్రధానమంత్రి మోడీకి ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తానంటూ తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు వక్రీకరించారని తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. మోడీని కొడతానని తాను చెప్పలేదని, ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తానని మాత్రమే అన్నానని, తన మాటలను బీజేపీ వక్రీకరించి ప్రచారం చేసుకుంటుందని స్పష్టంచేశారు.

‘మోడీని నేనెందుకు కొడతాను? మోడీని కొడితే నా చేయి విరిగిపోతుంది. ఆ పని నేనెందుకు చేయాలి? ఆయనది 56 అంగుళాల ఛాతీ. ఆయనను నేనెలా కొట్టగలను? ఆయనను కొట్టాలని కానీ కనీసం ముట్టుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు’ అని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే మీకు రాముడు గుర్తుకొస్తాడని, రాముడిని ఎన్నికల ఏజెంటుగా చేయడం బీజేపీకి అలవాటు అని మండిపడ్డారు. రాముడి పేరు చెప్పుకునే మీరు కనీసం ఒక్క రామాలయం అయినా కట్టించారా? అని మమత మోడీని ప్రశ్నించారు.