Gujarat Polls 2022: ఎమ్మెల్యే టికెట్లలో మహిళలు, యువతకు ప్రాధాన్యం.. కాంగ్రెస్ కీలక ప్రకటన

గత నెలలోనే ముగ్గురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నివేదించింది. కాగా, సోమవారం ఈ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశమై 39 మంది సభ్యులతో ఎన్నికల కమిటీని ఖరారు చేసింది. ఈ కార్యక్రమం అనంతరం రమేష్ చెన్నితల మాట్లాడుతూ ‘‘ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి యువతకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. అలాగే వీలైనన్ని కొత్త ముఖాల్ని పరిచయం చేయబోతున్నాం’’ అని ప్రకటించారు.

Gujarat Polls 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించి టికెట్ల పంపిణీ విషయంలో మహిళలకు, యువతకు ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం మంగళవారం ప్రకటించింది. అంతే కాకుండా వీలైనంత ఎక్కువ టికెట్లు కొత్తవారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ రమేష్ చెన్నితల పేర్కొన్నారు.

గత నెలలోనే ముగ్గురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నివేదించింది. కాగా, సోమవారం ఈ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశమై 39 మంది సభ్యులతో ఎన్నికల కమిటీని ఖరారు చేసింది. ఈ కార్యక్రమం అనంతరం రమేష్ చెన్నితల మాట్లాడుతూ ‘‘ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి యువతకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. అలాగే వీలైనన్ని కొత్త ముఖాల్ని పరిచయం చేయబోతున్నాం’’ అని ప్రకటించారు.

గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరనున్నాయి. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‭ను 1995 నుంచి భారతీయ జనతా పార్టీయే ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తోంది. అటు ఇటుగా మూడు దశాబ్దాల నుంచి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చినప్పటికీ అదికారాన్ని మాత్రం సాధించలేకపోయింది. రాష్ట్రంలో చిన్నా చితకా ఇతర పార్టీలు ఉన్నప్పటికీ పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే. అయితే పంజాబ్ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీదున్న గుజరాత్‭ ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ప్రధాన పోటీలో నిలబడుతుందా లేదా చూడాలి.

Bengaluru Flooding: బెంగళూరు వరదలకు కాంగ్రెసే కారణమట.. కర్ణాటక సీఎం బొమ్మై విమర్శలు

ట్రెండింగ్ వార్తలు