Gujarat : అతను హెల్మెట్ పెట్టుకోకపోయినా పోలీసులు జరిమానా విధించరు.. కారణం ఏంటో తెలుసా?

గుజరాత్‌కి చెందిన జాకీర్ అనే వ్యక్తి బైక్ నడుపుతూ హెల్మెట్ ధరించకపోయినా పోలీసులు చలాను విధించరు. అతనికి అంత మినహాయింపు ఎందుకు? అని మీకు ఖచ్చింతంగా డౌట్ వస్తుంది. కారణం ఏంటో చదవండి.

Gujarat : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, హెల్మెట్ ధరించకపోయినా, ర్యాష్‌గా డ్రైవ్ చేసినా పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే గుజరాత్‌కి చెందిన ఒకాయన హెల్మెట్ పెట్టుకోకపోయినా పోలీసులు పట్టించుకోవట్లేదట. ఆయనకి పోలీసులు అంత వెసులుబాటు ఎందుకు ఇచ్చారు? అని మీకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది. కారణం ఏంటో చదివాక ఆశ్చర్యపోతారు.

Suitcases Banned : ఈ అందాల నగరానికి సూట్‌కేసులు తీసుకెళితే జరిమానా.. ఎన్నో నిబంధనలున్నా పర్యాటకంగా అగ్రస్థానం

గుజరాత్‌ ఛోటా ఉదయ్‌పూర్ నివాసి జాకీర్ మెమన్ హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపినా పోలీసులు పట్టించుకోరు. గుజరాత్ పోలీసులే కాదు దేశంలో ఉండే లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కూడా అతనికి ఫైన్ వేయడానికి ఇబ్బంది పడ్డారు. అతనికి అంత మినహాయింపు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.  పండ్ల వ్యాపారం చేసే జాకీర్ 2019 లో హెల్మెట్ లేకుండా గుజరాత్ ట్రాఫిక్ పోలీసులకు కనిపించాడు. అప్పుడు అతనికి చలాను విధించాలని అనుకుని ఆగిపోయారు. కారణం తెలిసి వారు కూడా అవాక్కయ్యారు.

CBI Arrest: సీబీఐ ఏదైనా కేసు విషయంలో పీఎం, సీఎంలను నేరుగా అరెస్టుచేయొచ్చా.. అందుకు నిబంధనలు ఏమిటో తెలుసా?

జాకీర్ తలకి ఏ హెల్మెట్ సరిపోకపోవడం వల్లే అతను ధరించలేకపోతున్నానని తన సమస్యను పోలీసులకు వివరించాడు. అనుమానం వచ్చిన పోలీసులు జాకీర్‌ని దుకాణానికి తీసుకెళ్లి మరీ పరీక్షించారు. ఒక్క హెల్మెట్ కూడా జాకీర్ తలకు సరిపోకపోవడంతో అతను చెప్పింది నిజమేనని వారు ధృవీకరించుకున్నారు. అతనికి ఓ చిన్న వార్నింగ్ ఇచ్చి ఏమీ చేయలేక వదిలేసారు. అప్పటి నుంచి జాకీర్‌కి  పోలీసుల నుంచి నో చలాన్. ఈ వింత పరిస్థితి ప్రస్తుతానికి గుజరాత్‌లో మాత్రమే ఉందేమో.. దేశం మొత్తంలో ఇలాంటి కేసులు కొన్ని వస్తే హెల్మెట్ సైజుల తయారీలో మార్పులు తెస్తారేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు