RIP Uber Eats: Zomato కొనేసింది.. ఇక మిగిలింది Swiggyనే

ఫుడ్ యాప్ కంపెనీ జొమాటో .. యూబర్ ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను కొనుగోలు చేసిందని మంగళవారం ప్రకటించింది. ఈ డీల్ ప్రకారం.. జొమాటోలోని 10శాతం వాటాను యూబర్ సొంతం చేసుకోనుంది. ఇకనుంచి ఫుడ్ డెలీవరీ బిజినెస్‌లో ఇండియా యూబర్ ఈట్స్ పది శాతం వాటాతో జొమాటోలో కలిసిపోనుంది. దీనికి జొమాటో దాదాపు 350మిలియన్ డాలర్లు అంటే రూ.2వేల 492కోట్లను కేటాయించినట్లు సమాచారం.

2017లో లాంచ్ చేసిన యూబర్ టెక్నాలజీస్ ఫుడ్ డెలీవరీ బిజినెస్‌ కొనసాగడమే కష్టంగా మారింది. దానికి టాప్ బ్రాండ్లుగా దూసుకుపోతున్న జొమాటో, స్విగ్గీలు కూడా కారణం కావొచ్చు. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయెల్ మాట్లాడుతూ.. ‘యూబర్ ఈట్స్ లాంటి పెద్ద నెట్‌వర్క్‌తో కలవడం గర్వంగా ఉంది. భారత్‌లోని 500నగరాల్లో లీడింగ్‌‌లో ఉంది. ఫుడ్ విభాగంలో మా స్థానం మరింత బలోపేతంగా మారింది’ అని అన్నారు. 

యూబర్ ఈట్స్ రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ తీసుకోవడం.. కస్టమర్లకు డెలీవరీ చేయడం వంటివి పూర్తిగా ఆపేస్తుంది. ఈ ఎఫెక్ట్ వెంటనే అమలుకానుంది. ఇక నుంచి కేవలం యూబర్ ఈట్స్ వాటా తీసుకుని కలిసి పనిచేస్తుంది. పూర్తి జొమాటోనే అధికారికంగా పనిచేస్తుంది. 

యూబర్ యాప్‌లో ఫుడ్ ఆర్టర్ ఇచ్చినా.. రెస్టారెంట్లను వెదికినా జొమాటో నుంచే డెలివరీ అవుతుంది. యూబర్ ఈట్స్ ఫుడ్ నెట్‌వర్క్ ఎంతగా ఉందంటే విదేశాల్లోని రెస్టారెంట్లలోనూ దీనికి మంచి డిమాండ్ ఉంది. వ్యాపారాభివృద్ధి కోసం జొమాటో అధికారికంగా జనవరి 10నుంచి పెట్టుబడులు పెంచుతున్నట్లు ప్రకటించింది.