Zomato : లేటుగా వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్‌కి‌ బొట్టు పెట్టి .. హారతి ఇచ్చిన కష్టమర్

లేటుగా వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్‌కి‌ బొట్టు పెట్టి .. పాట పాడుతూ హారతి ఇచ్చాడో కష్టమర్.

Zomato Delivery boy food late..man welcomes ‘Aarti ki thaali : ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తాం. అబ్బా ఆకలి దంచేస్తోంది ఈ డెలివరీ బాయ్ తొందరగా వచ్చేస్తే బాగుండు అనుకుంటూ తెగ ఎదురు చూస్తుంటాం.కానీ ఈబాయ్ ఎంతకీ రాకపోతే ఓ పక్క ఆకలి మరోపక్క అసహనం వచ్చేస్తుంది. ఆ అసహనం కాస్తా ఆగ్రహంగా మారితే కొన్ని సందర్భాల్లో డెలీవరీ బాయ్ పై కోపం చూపిస్తాం. దానికి పాపం ఆడెలివరీ బాయ్ అదికాదు సార్..అడ్రస్ తెలియలేదనో..లేదా ట్రాఫిక్ జామ్ అయ్యిందనో లేదా మరోదేకారణం చెబుతాడు.కానీ మనకు మాత్రం ఆకలితో అవేవీ వినిపించవు. పైగా విసుక్కుంటాం. అలా తాను ఆర్డర్ చేసిన ఫుడ్ ను లేట్ గా తీసుకొచ్చిన డెలీవరీ బాయ్ కు ఓ వ్యక్తి బొట్టు పెట్టి పాటపాడుతూ హారతి కూడా ఇచ్చాడు. ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఢిల్లీలో మాత్రం ఒకాయన డెలీవరీ బాయ్ ఫుడ్ లేట్ గా తెచ్చాడని తన నిరసనను వినూత్నంగా ప్రదర్శిస్తూ..జొమాటో డెలివరీ బాయ్ రాగానే.. హెల్మెట్ తీయాలని కోరాడు. హెల్మెట్ తీశాక బొట్టు పెట్టి, హారతి ఇచ్చాడు. ఆ తర్వాత అక్షింతలు కూడా వేశాడు. ఈ సమయంలో ‘ఆయియే ఆప్‌ కా ఇంతెజార్‌ థా’ అంటూ పాట కూడా పాడాడు. ఇదేమీ సరిగా అర్థంకాని డెలివరీ బాయ్.. ఆ వ్యక్తి చెప్పినట్టు చేశాడు పాపం బుద్దిగా..దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన వీడియోను 50 లక్షల మందికిపైగా చూడగా..ట్విట్టర్, ఫేస్ బుక్ లలో కూడా తెగ వైరల్ అవుతోందీ వీడియో. కామెంట్ల వర్షం కురుస్తోందీ వీడియోపై.
‘‘డెలివరీ బాయ్ నిర్లక్ష్యానికి ఫలితం భలేగా ఉందే అని కొందరంటే..‘‘పాపం.. రెస్టారెంట్ వద్ద ఎంత లైన్ ఉందో, రోడ్డు మీద ట్రాఫిక్ ఎంత ఉందో.. కావాలని లేట్ చేస్తాడా? ఏంటీ అంటూ మరికొందరు ఇంకొందరు మరోలా కామెంట్స్ పెడుతున్నారు.

కామెంట్ల తీరు ఇలా ఉంటే మరి సదరు జొమాటో డెలీవరీ బాయ్ స్పందనేంటంటే.. నిజానికి తాను సరైన సమయంలోనే డెలివరీ చేశానని జొమాటో డెలివరీ బాయ్ అశీష్ ఝా చెబుతున్నాడు. ఆ రోజున తాను డెలివరీ చేసిన ఆర్డర్ కు సంబంధించిన టైమ్ స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేశాడు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ జొమాటో కేర్ ఖాతాను ట్యాగ్ చేశాడు.