కరోనా సెకండ్ వేవ్.. స్విగ్గీ, జొమాటో సేవలు బంద్..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. మహారాష్ట్రలో ప్రస్తుతం మునుపటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కునుకులేకుండా చేస్తుంది. మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌లో తీవ్ర ఇబ్బందులు పడగా.. ఇప్పుడు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మాత్రమే లాక్‌డౌన్‌ అమలు చేస్తుంది ప్రభుత్వం. లేటెస్ట్‌గా వారాంతాల్లో (శని, ఆదివారం) పూర్తి లాక్‌డౌన్‌ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టేవరకు ఫుడ్‌ డెలివరీ సంస్థల సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో రాత్రి 8 గంటల తర్వాత తాము డోర్ డెలివరీ చేయలేమని జొమాటో, స్విగ్గీ సంస్థలు ప్రకటించింది. వినియోగదారులకు ఈ విషయాన్ని ఓ నోటిఫికేషన్ ద్వారా పంపాయి సదరు సంస్థలు. రాత్రి 8 నుంచి ఉదయం 7గంటల వరకు మినీ లాక్‌డౌన్‌ విధించడంతో ఆయా సంస్థలు తమ సేవల సమయాన్ని కూడా మార్చేశాయి.

ట్రెండింగ్ వార్తలు